NTV Telugu Site icon

MLC Kavitha : సుప్రీంకోర్టులో సమర్పించిన కవిత అభ్యంతరాలు ఇవే..

Mlc Kavitha

Mlc Kavitha

ఢిల్లీ లిక్కర్‌స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.. ఈడీ నోటీసులను సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈనెల 24న విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు విచారణను ఈనెల 27కు వాయిదా వేసింది. ఈ క్రమంలోనే నేడు కవిత పిటషన్‌పై సుప్రీంకోర్టు విచారించనుంది. అయితే.. “భారత శిక్షాస్మృతి లోని 160 సెక్షన్ లో పేర్కొన్న నిబంధనల ప్రకారం విచారణ జరగలేదని సుప్రీంకోర్టుకు తెలియజేసిన కవిత. మహిళలు, 15 ఏళ్లలోపు పిల్లలు, వృధ్దులను ఇంటికే వచ్చి దర్యాప్తు సంస్థలు విచారణ చేయాలని భారత శిక్షాస్మృతిలోని 160 సెక్షన్ స్పష్టంగా పేర్కొంది.

Also Read : WPL 2023 : ముంబయి ఇండియన్స్ జట్టు గెలచుకున్న ప్రైజ్ మనీ ఎంతో తెలుసా..?

విచారణ పేరుతో రాత్రి పొద్దుపోయేంతవరకు ఈడీ కార్యాలయంలోనే ఉంచడం అభ్యంతరకరమని, సీబీఐ ఇంటికి వచ్చి విచారణ చేసింది కాబట్టి, ఈడి అధికారులు కూడా ఇంటికే వచ్చి విచారణ చేయవచ్చన్న అంశాన్ని సుప్రీంకోర్టు కు తెలియజేశారు కవిత. నిందితురాలు కానప్పటికీ కూడా విచారణకి ఈడీ కార్యాలయానికి రావాలని కోరడంపై కవిత అభ్యంతరం వ్యక్తం చేశారు. అంతేకాకుండా.. విచారణ పేరుతో కార్యాలయానికి వచ్చిన తర్వాత “వ్యక్తిగత ఆస్తి” అయిన ఫోను ను బలవంతంగా తీసుకోవడంపై ఆమె తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అలాగే.. మద్యం కేసు విచారణ కోసం “సిట్” (స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం) ను (ప్రత్యేక విచారణ బృందాన్ని) ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు కవిత.

Also Read : Manchu Manoj: విష్ణు గొడవపై స్పందించిన మనోజ్…