సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిని ఎమ్మెల్సీ కవిత పరామర్శించారు. ఈ నెల 27న గుండెపోటుతో కాంటి నెంటల్ ఆస్పత్రిలో మహిపాల్‌రెడ్డి కుమారుడు గూడెం విష్ణువర్ధన్ రెడ్డి మృతిచెందారు. విష్ణువర్ధన్ రెడ్డి మరణం అత్యంత బాధాకరమని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అతి పిన్న వయసులో తండ్రికి తగ్గ తనయుడిగా రాజకీయాల్లో ఎదుగుతున్న గూడెం విష్ణువర్ధన్ రెడ్డి అకాల మరణం అత్యంత బాధాకరమని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డికి పుత్రశోకం కలగడం తనను దిగ్భ్రాంతిని గురిచేసిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read : Mahesh Babu: సిర్ఫ్ దస్ దిన్ మే మిలేంగే సూర్య భాయ్…
అయితే.. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న విష్ణువర్ధన్ రెడ్డి హైదరాబాద్‌లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈనెల 27న తెల్లవారుజామున మృతి చెందారు. విష్ణవర్దన్ రెడ్డి విద్యార్థి దశ నుంచి బీఆర్ఎస్‌లో క్రియాశీల సభ్యుడిగా ఉన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న విష్ణువర్దన్ రెడ్డి జూలై 23న హైదరాబాద్‌లోని కాంటినెంటల్ ఆస్పత్రిలో చేరారు. అక్కడ ఆయనకు పరీక్షలు నిర్వహించిన వైద్యులు జాన్‌డీస్‌తో బాధపడుతున్నట్టుగా తేల్చారు.
Also Read : Karumuri Nageswara Rao: చంద్రబాబు కుట్రలను తిప్పికొట్టాలి.. జగన్‌ను మళ్లీ సీఎం చేయాలి