MLC Kavitha: ప్రధాని నరేంద్ర మోడీ నిజామాబాద్‌కు వచ్చి వెళ్లారని.. ఐఐఎం మెడికల్ కాలేజ్‌లు ఉన్నత విద్యా సంస్థలు విభజన హామీలు ఏవీ అమలు చేయని పార్టీ బీజేపీ అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. గత ఎన్నికల్లో బీజేపీకి 105 సీట్లలో డిపాజిట్‌లు రాలేవన్నారు. వాళ్లకు తెలంగాణలో సీట్లు వచ్చేది లేదన్నారు. బీజేపీ ప్రభుత్వం వచ్చేది లేదని.. కాంగ్రెస్, బీజేపీ పార్టీల దృష్టిలో తెలంగాణ లేదన్నారు ఎమ్మెల్సీ కవిత. ఆ రెండు పార్టీల గురించి ప్రజలు ఆలోచించాలన్నారు.
Also Read: Goshamahal Constituency: గోషామహల్ బీఆర్‌ఎస్ అభ్యర్థిగా నందకిషోర్ వ్యాస్
బీజేపీ బీసీ ముఖ్యమంత్రి హామీ హాస్యాస్పదమని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. బీసీలకు ఇన్నాళ్లు బీజేపీ ఏం చేసిందని ఆమె ప్రశ్నించారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌కు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు.