NTV Telugu Site icon

MLC Jeevan Reddy : దరఖాస్తులు స్వీకరించకుండా దళిత బంధు లబ్దిదారుల ఎంపిక ఎలా చేస్తున్నారో చెప్పాలి

Jeevan Reddy

Jeevan Reddy

జగిత్యాల జిల్లా కేంద్రం లోని ఇందిరా భవన్ లో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో కొనసాగుతుంది భారత రాజ్యాంగమా.. బీఆర్ఎస్ రాజ్యాంగమా అని ఆయన అన్నారు. దరఖాస్తులు స్వీకరించకుండా దళిత బంధు లబ్దిదారుల ఎంపిక ఎలా చేస్తున్నారో చెప్పాలన్నారు. దళిత బంధు ఎమ్మెల్యే బందుగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు జీవన్‌ రెడ్డి. జీ ఓ 8 లో పేర్కొన్నట్లుగా ప్రజా ప్రతినిధులు అంటే ఎవరో కలెక్టర్ స్పష్టత నివ్వాలని, కాంగ్రెస్ గ్యారంటీ పథకాలను ప్రతి ఇంటికి తీసుకెళ్తామన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీ సీ బంధు, మైనారిటీ బంధు, దళిత బంధు అంటూ ప్రజలను మభ్య పెడుతున్నారని ధ్వజమెత్తారు. 2018 నుండి గృహ నిర్మాణ కార్యక్రమాలు, దళితులు, బలహీన వర్గాల స్వయం ఉపాధి పథకాలు పూర్తిగా స్తభింపజేశారన్నారు.

Also Read : Rahul Dravid: ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్.. రోహిత్, కోహ్లీకి విశ్రాంతి అందుకోసమేనట..!

అంతేకాకుండా.. ‘2018 నుండి డబుల్ బెడ్రూం పథకం పూర్తిగా నిలిపి వేశారు. పదేళ్ల లో గృహ నిర్మాణ వ్యయం రెట్టింపు కాగా ఇంటి నిర్మాణం కోసం రు. 10 లక్షలు ఇవ్వాల్సిందిపోయి రు. 3 లక్షలు ఇస్తామంటున్నరు. దళిత బంధు ఎమ్మెల్యే బంధు గా మారింది, రాష్ట్రంలో కొనసాగుతుంది భారత రాజ్యాంగమా…బీ ఆర్ ఎస్ ప్రత్యేకంగా ఏదైనా రాజ్యాంగం అమలు చేస్తున్నారా…. ఆశావహుల నుండి ధరఖాస్తులు స్వీకరించకుండా దళిత బంధు లబ్దిదారులను ఏ విధంగా ఎంపిక చేస్తున్నారు. దళిత బంధు లబ్ధిదారులను ఎలా ఎంపిక చేస్తున్నారో తేలియక దళిత సమాజం ఆందోళన చెందుతోంది.. రాజ్యాంగం లో ఫోర్త్ ఎస్టేట్ ప్రజాస్వామ్య పరిరక్షణ లో కీలకమైన పాత్రికేయుల ద్వారానైనా లబ్దిదారుల ఎంపిక ఎలా చేస్తున్నారో ప్రకటించారా…. దళిత బంధు విధి విధానాలు ఏమిటో చెప్పాలన్నారు. జగిత్యాల జిల్లా పారదర్శకతకు ఆదర్శంగా నిలిచే జిల్లా క్షేత్ర స్థాయిలో ప్రజా ప్రతినిధులు అంటే ఎవరో స్పష్టత ఇవ్వాలి అని జిల్లా కలెక్టర్ కి విజ్ఞప్తి చేస్తున్నామన్నారు.

Also Read : Rahul Dravid: ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్.. రోహిత్, కోహ్లీకి విశ్రాంతి అందుకోసమేనట..!

కాంగ్రెస్ గ్యారంటీ పథకాలు ప్రతి ఇంటికి తీసుకెళ్తామని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. గృహ నిర్మాణ కోసం స్థలం కేటాయించి, ఇంటి నిర్మాణం కోసం రు.5లక్షలు ఇస్తాం. సిలిండర్ ధర ఎంత ఉన్నప్పటికీ రు.500 లకే అందజేస్తాం.. ప్రతి మహిళకు రు.2,500 ఉచిత రవాణా సౌకర్యము కల్పిస్తాం.. వరి ధాన్యం మద్దతు ధర పై అదనంగా రు.500 చెల్లిస్తాం.. గృహ జ్యోతి కింద 200 యూనిట్ల వరకు ఉచితంగా అందజేస్తాం.. విద్యా జ్యోతి కింద విద్యార్థులు ఉన్నత చదువులకు రు.5 లక్షలు ఆర్థిక సాయం అందిస్తాం.. కాంగ్రెస్ గ్యారంటీ కార్డు.. ప్రజల హక్కు పత్రం.. ఇంటి ఇంటికి కాంగ్రెస్ గ్యారంటీ తీసుకెళ్తాము. బీఆర్ ఎస్ అనాలోచిత విధానంతో మిషన్ భగీరథ పేరిట 50 వేల కోట్ల ఆర్థిక భారం ప్రజల పై మోపారని విమర్శించారు. ఎన్ టీ పీ సీ లో 4000 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసుకునే అవకాశం ఉన్నా ఎందుకు యాదాద్రి నిర్మిస్తున్నారు..’ అని జీవన్‌ రెడ్డి వ్యాఖ్యానించారు.