Site icon NTV Telugu

MLC Elections : ముగిసిన పట్టభద్రులు, టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు ప్రచారం..

Mlc Elections 2025

Mlc Elections 2025

MLC Elections : కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ పట్టబద్రులు, టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు ప్రచారం ముగిసింది. ఈనెల 27 న టీచర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ జరుగనుంది. గత 15 రోజులుగా ప్రచారాన్ని హోరెత్తించారు అభ్యర్థులు. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ ఎన్నికలకు దూరంగా ఉంది. పట్టభద్రుల స్థానంలో బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ అభ్యర్థుల మధ్య ట్రయాంగిల్ వార్ జరుగనుంది. బీజేపీ కాంగ్రెస్ అభ్యర్థుల తరుఫున ప్రచారం చేశారు పార్టీ అగ్రనేతలు.. కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతుగా సీఎం రేవంత్, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్… పలువురు మంత్రులు ప్రచారం చేయగా.. బీజేపీ అభ్యర్థికి మద్దతు గా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. బండి సంజయ్ పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేల ప్రచారం చేశారు. ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. నాలుగు ఉమ్మడి జిల్లాల పరిధిలో 3,55,159 మంది పట్టబద్ర ఓటర్లు, 27088 మంది ఉపాధ్యాయ ఓటర్లు ఉన్నారు. గ్రాడ్యుయేట్ స్థానంలో 499 పోలింగ్ కేంద్రాలు, టీచర్ స్థానంలో 274 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు అధికారులు. ఈనెల 27 న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. మార్చి 3 న ఓట్ల లెక్కింపు ఉంటుంది.

Graduate MLC: ఉభయగోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక.. సాయంత్రం ప్రచారానికి తెర

అయితే.. మెదక్‌-నిజామాబాద్‌-ఆదిలాబాద్‌-కరీంనగర్‌ పట్టభద్రుల స్థానంలో 56 మంది పోటీలో ఉండగా..మొత్తం ఓటర్లు 3,41,313 మంది ఉండగా పురుషులు 2,18,060 మంది, మహిళలు 1,23,250 మంది, ఇతరులు ముగ్గురు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మెదక్‌-నిజామాబాద్‌-ఆదిలాబాద్‌-కరీంనగర్‌ పట్టభద్రుల నియోజకవర్గంలో టీచర్ల స్థానంలో 15 మంది పోటీ ఉండగా మొత్తం ఓటర్లు 25,921 మంది ఉండగా పురుషులు 16,364 మంది, మహిళలు 9,557 మంది ఉన్నారు. వరంగల్‌-ఖమ్మం-నల్గొండ ఉపాధ్యాయ నియోజకవర్గంలో 19 మంది పోటీలో ఉండగా.. మొత్తం ఓటర్లు 24,905 మంది ఉండగా పురుషులు 14,940 మంది, మహిళలు 9,965 మంది ఉన్నారు.

CP Sudheer Babu : పసి బిడ్డలను అమ్ముకుంటున్న ముఠా అరెస్ట్

Exit mobile version