MLC Elections 2025: ఏపీ, తెలంగాణలో ప్రారంభమైన ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు!
- తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు
- ఉదయం 8 గంటలకు ప్రారంభమైన లెక్కింపు
- కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణలో ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు మొదలుపెట్టారు. అభ్యర్థులు, ఏజెంట్ల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్‌ను అధికారులు ఓపెన్ చేశారు. ముందుగా బ్యాలెట్ పేపర్లను కట్టలు కట్టనున్నారు. ఈ ప్రక్రియ దాదాపుగా మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతుందని.. అసలు కౌంటింగ్ ప్రక్రియ ఆ తర్వాత మొదలు కానుందని అధికారులు చెప్పారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఫలితాలు సాయంత్రంలోగా వెల్లడి కానున్నాయి. అయితే పట్టుభద్రుల ఓట్ల లెక్కింపు ఫలితం రావడానికి మాత్రం 2, 3 రోజుల సమయం పట్టే అవకాశముంది. కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు.
ఏపీ, తెలంగాణలో ఫిబ్రవరి 27న ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఏపీలో 2 గ్రాడ్యుయేట్, ఒక టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి.. తెలంగాణలో 2 టీచర్, ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు జరిగాయి. ఏపీలో మూడు ఎమ్మెల్సీ స్థానాల బరిలో 70 మంది అభ్యర్థులు, తెలంగాణలో మూడు ఎమ్మెల్సీ స్థానాల బరిలో 90 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. ఈ 6 ఎమ్మెల్సీ స్థానాలకు నేడు లెక్కింపు జరుగుతోంది. చెల్లుబాటు అయిన ఓట్లలో 50 శాతానికి పైగా ఓట్లు వచ్చిన అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తారు.
Also Read
- New Train Service: ఏపీ రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. కొత్త రైలు వచ్చేసింది.. వారానికి 3 రోజులు..
- Honor Smart Phone: 200MP కెమెరా, 11,000mAh బ్యాటరీ.. మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్..
- TG ECET: టీజీ ఈసెట్ 2026 ఫలితాలు విడుదల.. 96.04 శాతం ఉత్తీర్ణత..
- AP Govt: ఏపీలో మున్సిపల్ కమిషనర్ల బదిలీ.. జీవో జారీ చేసిన ప్రభుత్వం..
కరీంనగర్-మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్ పట్టభద్రుల నియోజకవర్గం సహా ఉపాధ్యాయ నియోజకవర్గానికి కరీంనగర్‌లోని అంబేడ్కర్ ఇండోర్ స్టేడియంలో.. వరంగల్-ఖమ్మం-నల్గొండ ఉపాధ్యాయ నియోజకవర్గానికి నల్గొండలోని వేర్‌హౌసింగ్ గోదాములో కౌంటింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. మరోవైపు ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ నియోజకవర్గ ఓట్ల లెక్కింపు విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీలో.. ఉభయగోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గానిది ఏలూరులోని వట్లూరు సీఆర్‌ఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో, కృష్ణా-గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గ ఓట్ల లెక్కింపు గుంటూరు ఏసీ కాలేజీలో కొనసాగుతోంది.
తాజావార్తలు
-
Balakrishna – Koratala Siva: కొరటాల మూవీలో మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్.. ఒకే ఫ్రేమ్‌లో ఇద్దరు బాలయ్యలు!
-
New Train Service: ఏపీ రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. కొత్త రైలు వచ్చేసింది.. వారానికి 3 రోజులు..
-
CM Revanth Reddy: రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. విద్య నుంచి ‘SIR’ వరకు ఫుల్ ఫైర్
-
Honor Smart Phone: 200MP కెమెరా, 11,000mAh బ్యాటరీ.. మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్..
-
TG ECET: టీజీ ఈసెట్ 2026 ఫలితాలు విడుదల.. 96.04 శాతం ఉత్తీర్ణత..
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!