Balakrishna – Koratala Siva: కొరటాల మూవీలో మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్.. ఒకే ఫ్రేమ్‌లో ఇద్దరు బాలయ్యలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Balakrishna – Koratala Siva: టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించేందుకు నందమూరి బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ క్రేజీ కాంబినేషన్ సిద్ధమవుతోంది. వీరిద్దరి కలయికలో రాబోయే భారీ చిత్రంపై రోజురోజుకూ అంచనాలు ఆకాశాన్ని తాకుతుండగా, తాజాగా ఇండస్ట్రీ వర్గాల నుంచి బయటకు వచ్చిన ఓ పవర్ ఫుల్ లీక్ నందమూరి అభిమానుల్లో పూనకాలు తెప్పిస్తోంది. ఈ సినిమాలో బాలయ్య గతంలో ఎన్నడూ చూడని రీతిలో రెండు విభిన్న పాత్రల్లో కనిపించబోతున్నారట. కేవలం డ్యూయల్ రోల్ మాత్రమే కాకుండా, ఒకే ఫ్రేమ్‌లో తండ్రి – కొడుకు పాత్రల్లో బాలకృష్ణ స్వయంగా నటించి ప్రేక్షకులను సర్ప్రైజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ‘దేవర’ లాంటి భారీ ప్రాజెక్ట్ తర్వాత కొరటాల శివ దర్శకత్వం వహిస్తుండటంతో, కథ విషయంలో ఆయన ఎలాంటి రాజీ పడకుండా పక్కా ప్లాన్‌తో స్క్రిప్ట్ సిద్ధం చేశారని చెబుతున్నారు.
సమాజంలోని బలమైన రాజకీయ అంశాలతో పాటు, ప్రేక్షకుల హృదయాలను హత్తుకునే భావోద్వేగపూరితమైన ఫ్యామిలీ డ్రామాను ఈ చిత్రంలో ప్రధానంగా పొందుపరిచినట్లు సమాచారం. ఈ ప్రాజెక్ట్ కోసం బాలకృష్ణ పూర్తిగా సరికొత్త మేకోవర్‌తో అదిరిపోయే లుక్‌లోకి మారనున్నారని తెలుస్తుంది. ఇటీవలే గాయం నుంచి కోలుకున్న ఆయన, సరికొత్త ఎనర్జీతో సెట్స్‌పైకి అడుగుపెట్టేందుకు ఉత్సాహంగా ఉన్నారు. నిర్మాత సుధాకర్ చెరుకూరి అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ భారీ పాన్-ఇండియా చిత్రం ఫస్ట్ షెడ్యూల్ డిసెంబర్ ఫస్ట్ వీక్ నుంచే పట్టాలెక్కనుందని తెలుస్తుంది. బాలయ్య నుంచి ఫ్యాన్స్ ఆశించే మాస్ ఎలివేషన్లకు కొరటాల మార్క్ సందేశం, తండ్రీకొడుకుల సెంటిమెంట్ తోడైతే వెండితెరపై వసూళ్ల వర్షం కురవడం ఖాయం అని ట్రేడ్ వర్గాలతో పాటు నందమూరి అభిమానులు అభిప్రాయపడుతున్నారు.
Also Read
- Mega Podcast: దశాబ్దం తర్వాత డిజిటల్ స్క్రీన్‌పై మెగా హోస్టింగ్.. ఆ రెమ్యునరేషన్ లెక్కలు ఏంది బాస్!
- Suriya: స్టేజ్‌పై డైరెక్టర్ రాజమౌళికే స్వీట్ షాక్ ఇచ్చిన స్టార్ హీరో సూర్య! వైరల్ అవుతున్న వీడియో...
- Ranabali Documentary: కథపై హైప్ పెంచుతుందా? ఆసక్తిని చంపేస్తుందా?.. రణబాలి డాక్యుమెంటరీ స్ట్రాటజీపై హాట్ డిబేట్!
- Slum Dog Glimpse: అమ్మ ఉన్నది అన్నం పెట్టడానికి, అడుక్కోవడానికి కాదు.. కన్నీళ్లు పెట్టిస్తున్న ‘స్లమ్ డాగ్’ గ్లింప్స్!
తాజావార్తలు
-
Balakrishna – Koratala Siva: కొరటాల మూవీలో మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్.. ఒకే ఫ్రేమ్‌లో ఇద్దరు బాలయ్యలు!
-
New Train Service: ఏపీ రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. కొత్త రైలు వచ్చేసింది.. వారానికి 3 రోజులు..
-
CM Revanth Reddy: రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. విద్య నుంచి ‘SIR’ వరకు ఫుల్ ఫైర్
-
Honor Smart Phone: 200MP కెమెరా, 11,000mAh బ్యాటరీ.. మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్..
-
TG ECET: టీజీ ఈసెట్ 2026 ఫలితాలు విడుదల.. 96.04 శాతం ఉత్తీర్ణత..
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!