Batti Vikramarka: సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర మహబూబ్ నగర్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలో కొనసాగుతుంది. అందులో భాగంగా మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఉద్యోగులకు సిపిఎస్ విధానాన్ని రద్దుచేసి ఓపిఎస్ ను పునరుద్ధరణ చేస్తామని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు స్థానికతను కోల్పోయే విధంగా తీసుకువచ్చిన 317 జీవోను రద్దుచేసి గతంలో మాదిరిగా బదిలీలు చేపడతామన్నారు. రాజ్యాంగం ప్రకారం పోలీసులు విధులు నిర్వహించకుంటే రాజ్యాంగేతర శక్తులు పుడతాయని భట్టి విమర్శించారు.
Read Also: Minister Talasani: చేప ప్రసాదం పంపిణీకి విస్తృత ఏర్పాట్లు : మంత్రి తలసాని
మరోవైపు పోలీసులపై కీలక వ్యాఖ్యలు చేశారు భట్టి విక్రమార్క. పోలీస్ మ్యానువల్ పాటించకుండా చట్టాన్ని తుంగలో తొక్కి.. అధికార పార్టీ ఎమ్మెల్యేలు చెప్పినట్టుగా క్షేత్రస్థాయిలో పోలీసులు పనిచేస్తున్నారన్నారు. అంతేకాకుండా ప్రజల భావ వ్యక్తీకరణను అడ్డుకొని భయభ్రాంతులకు గురి చేయాడాన్ని ఆయన ఖండిస్తున్నట్లు తెలిపారు. ఆదిలాబాద్ నుంచి అచ్చంపేట వరకు పాదయాత్ర చేసిన ప్రతి గ్రామంలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు పెడుతున్న తప్పుడు కేసుల నుంచి కాపాడాలని ప్రజలు కోరుతున్నారని భట్టి పేర్కొన్నారు. పోలీసులను ప్రజల కోసం పనిచేయడానికి వ్యవస్థీకృతం చేశారని. పోలీస్ ఉన్నతాధికారుల ఆదేశాలు కాకుండా క్షేత్రస్థాయిలో ఉన్న ఎస్సై మొదలుకొని డిఎస్పి వరకు అధికార పార్టీ ఎమ్మెల్యేల ఆదేశాలు తూ.చా తప్పకుండా అమలు చేస్తున్నారని దుయ్యబట్టారు.
Read Also: Beers Looted: బీరు సీసాలతో వెళ్తున్న వ్యాన్ బోల్తా.. నిమిషాల్లోనే..
అధికార పార్టీ ఎమ్మెల్యేలు చెప్పినట్టుగా పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారని.. ఎమ్మెల్యేలు చెప్పిన సెక్షన్లే పెడుతున్నారని భట్టి ఆరోపించారు. ఇది ప్రజాస్వామ్యానికి అత్యంత ప్రమాదకరమని తెలిపారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు సిఫారసు చేసిన పోలీసులకే బదిలీలు, పోస్టింగ్ లు ఇస్తున్న దుస్థితి నెలకొందన్నారు. ఇది ప్రజాస్వామ్యానికి ప్రశ్నార్థకంగా మారుతుందని భట్టి విక్రమార్క తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం శాశ్వతం కాదు. ప్రజల కోసం ఏర్పాటు చేసిన వ్యవస్థలను నాశనం చేయోద్దని భట్టి సూచించారు. డీజీపీ నుంచి ఎస్పీ వరకు నిబంధన ప్రకారం క్షేత్రస్థాయిలో ఉన్న పోలీస్ అధికారులను పనిచేయించాలని ఉన్నా.. వారి కంట్రోల్ లో లేదన్నారు. పోలీస్ శాఖలో రాజకీయ ప్రమేయం లేకుండా.. బిఆర్ఎస్ ప్రభుత్వం వ్యవహరించాలని పేర్కొన్నారు.
Read Also: Polavaram Project: ఏపీకి గుడ్‌న్యూస్ చెప్పిన కేంద్రం.. ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు అదనపు నిధులు
సీఎం కేసీఆర్ నాగర్ కర్నూల్ రాక సందర్భంగా జిల్లాలో కాంగ్రెస్ నాయకులను ముందస్తు అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు భట్టి విక్కమార్క తెలిపారు. ప్రజాస్వామ్యయుతంగా, రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన కాంగ్రెస్ పార్టీని దేశంలో గాని, తెలంగాణలో ఏమైనా నిషేధం విధించారా? ఎందుకని ముందస్తు అరెస్టులు చేస్తున్నారని ప్రశ్నించారు. పబ్లిక్ ఫంక్షన్ కు వచ్చేటువంటి ముఖ్యమంత్రి ప్రజలు లేకుండా భజన పరులను వెంటబెట్టుకొని కలెక్టర్, ఎస్పీ కార్యాలయం ప్రారంభోత్సవం చేయడమేంటన్నారు. ప్రజలలో సీఎం కేసీఆర్ లేరు. ఎన్నికలు ఎప్పుడు వస్తాయని ప్రజలు ఎదురుచూస్తుండ్రు అని భట్టి తెలిపారు. కాంగ్రెస్ ను గెలిపించి ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి ఆశపడుతుండ్రని భట్టి విక్రమార్క అన్నారు. మరోవైపు ధరణి వల్ల బాగుపడుతుంది భూస్వాములు, ప్యూడలిస్టుల అని భట్టి అన్నారు.
ఫ్యూడలిస్టులు ఉండొద్దని 70 ఏళ్ల కింద నిటారుగా నిలబడి పోరాటం చేసిన సమాజాన్ని మెడలు వంచి తిరిగి ఫ్యూడలిజం తీసుకువచ్చేందుకు సీఎం కేసీఆర్ ధరణి తీసుకువచ్చారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ధరణి చట్టాన్ని బంగాళాఖాతంలో పడేస్తామని భట్టి విక్రమార్క హెచ్చరించారు.
