MLA Peddi Surdarshan : మంత్రి హరీష్ రావు చెప్పింది ముమ్మాటికి నిజం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇటీవల తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు రాష్ట్రంలో అమలు చేస్తున్న ఫిట్‌మెంట్‌పై పక్క రాష్ట్రమైన ఏపీతో పోల్చుతు చేసిన వ్యా్ఖ్యలు దుమారం రేపుతున్నాయి. అయితే.. హరీష్ రావు వ్యాఖ్యలపై వైసీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ.. టీచర్ యూనియన్ సమావేశంలో మంత్రి చేసిన వ్యాఖ్యలపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం తగదన్నారు. మంత్రి హరీష్ రావు చెప్పింది ముమ్మాటికి నిజం. అందులో ఎలాంటి అవాస్తవాలు లేవన్నారు. ఆయన మాట్లాడిన సందర్బం వేరని, తెలంగాణ ప్రభుత్వం 73శాతం ఫిట్‌మెంట్ ఇస్తే, పక్క రాష్ట్రంలో 66 శాతం మించి ఇవ్వలేదన్నారు. కేంద్రం విధించిన షరతులకు తలొగ్గి మీటర్లు పెట్టి 7వేల కోట్లు తీసుకున్నప్పటికీ ఫిట్మెంట్ ఇవ్వలేక పోయారు అని మంత్రి చెప్పారని ఇది వాస్తవమన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణ పథకాల పైన ప్రాజెక్టుల పైన అనేకసార్లు కంప్లైంట్ చేసింది.
Also Read
విడిపోయి సీఎం కేసీఆర్ నాయకత్వంలో మేము బాగా అభివృద్ధి చెందుతున్నామని, మాపైన ఈర్ష్య ఉండవచ్చని మేం పట్టించుకోవడం లేదన్నారు. ప్రభుత్వ ఉద్యోగులను కించపరిచే విధంగా మంత్రి హరీష్ రావు మాట్లాడారని సజ్జల అనడం సరికాదని, ఉద్యమ సమయంలో తెలంగాణకు వ్యతిరేకులుగా ఉన్న వారిని, విషం కక్కిన వారినీ మాత్రమే వ్యతిరేకించామన్నారు. ఆ తర్వాత అందరం కలిసి పనిచేసి బ్రహ్మాండంగా ముందుకు వెళ్తున్నామని, మంత్రి హరీష్ రావు ఇతర రాష్ట్రాల వారిపై గాని, ప్రభుత్వ ఉద్యోగులపై గాని ఏనాడు తప్పుడు వ్యాఖ్యలు చేయలేదన్నారు.
ఉచిత కరెంటు అంటూ పేరు చెప్పి అధికారంలోకి వచ్చి నేడు వైయస్ ఆశయాలను తుంగలో తొక్కే నిర్ణయాలను వైయస్ఆర్ పార్టీ తీసుకున్నదని, నాణ్యమైన కరెంటు ఇస్తామంటూ, మోటార్లకు మీటర్లు పెట్టి రైతులను మోసం చేస్తున్నారని, ప్రచారం కోసం ఆంధ్రప్రదేశ్ నాయకులు తెలంగాణపై గాని, టీఆర్ఎస్ నాయకులపై గానీ, మంత్రి హరీష్ రావుపై గానీ అనవసరపు వ్యాఖ్యలు చేయవద్దని కోరుతున్నానని ఆయన వెల్లడించారు.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?