Site icon NTV Telugu

MLA Shankar Naik : వివాదస్పద వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే శంకర్‌ నాయక్‌

Mla Shankar Naik

Mla Shankar Naik

మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్.. షర్మిల…రేవంత్ రెడ్డిల పైనా ఘాటు వ్యాఖ్యలు చేశారు.. నియోజకవర్గంలో షర్మిల పాదయాత్ర మొదలు కాబోతున్న తరుణంలో మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్‌ నాయక్ ఘాటైన వ్యాఖ్యలు చేశారు…. అంతేకాదు ఆంధ్ర నుండి కొజ్జోలా ఉండే వాళ్ళు కొందరు.. వలస వాదులు వస్తున్నారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు నిర్వహించి అనతరం పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు అనంతరం వారు మాట్లాడుతూ… భూమికి మూరెడు లేని వారు కూడా సీఎం కేసీఆర్ కుటుంబం పై ఇష్టమున్నట్లు మాట్లాడుతున్నారు అని,వలసవాదులు తమ అవసరాల కోసం తెలంగాణలో పర్యటనలు చేస్తున్నారన్నారు.

Also Read : Harish Rao : తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తోంది

పర్యటనలు చేసుకోండి కానీ మాట్లాడే భాష నోరు అదుపులో పెట్టుకోండి లేదంటే మానుకోట కంకర రాళ్ళకు మరొకసారి పని కల్పించవలసి వస్తుంది అన్నారు. అంతేకాదు ‘ఆంధ్ర నుండి కొజ్జాల లాగా ఉంటారు.. వాళ్లు వలసవాదులు వాళ్ళు వస్తున్నారు… మా పార్టీ కార్యకర్తలకు కనుసైగా చేస్తే చాలు తరిమి తరిమి కొడతారు’ అని అన్నారు శంకర్‌ నాయక్‌. యాత్రల పేరుతో వచ్చే ప్రతి నాయకుడు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడి ప్రజలకు ఏమి చేస్తారో చెప్పండని శంకర్‌ నాయక్‌ అన్నారు.

Also Read : INDvsAUS 2nd Test: ఖవాజా, హ్యాండ్స్‌కాంబ్ పోరాటం.. ఆసీస్ 263 ఆలౌట్

Exit mobile version