యాదాద్రి జిల్లా ఆలేరు మండలం రఘునాధపురంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ సభకు ములుగు ఎమ్మెల్యే సీతక్క హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిందని, కచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఈసారి అవకాశం ఇవ్వాలన్నారు. ఉండడానికి ఇల్లు లేని ప్రజలు అవస్థలు పడుతుంటే.. ఇంద్ర భవనాల లాంటి పరిపాలన భవనాలు కడుతున్నారని ఆమె మండిపడ్డారు. చాలామంది అధికార పార్టీ ఎమ్మెల్యేలు భూ కబ్జాలకు పాల్పడుతున్నారని ఎమ్మెల్యే సీతక్క ఆరోపించారు. పేదల భూములను బలవంతంగా లాక్కొని వారి కీలక అనుచరులకు ప్రభుత్వం ఇస్తోందని ఆమె విమర్శించారు. పేదల కష్టాలు తీరాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల్సిందేనని ఆమె ఉద్ఘాటించారు. నిరుపేదలకు ఇల్లు, వ్యవసాయ భూములు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది అని ఆమె కొనియాడారు. 5వేలు ఇచ్చి ఓట్లు కొనుక్కుంటున్న కేసీఆర్ ఇంటి నిర్మాణానికి ఐదు లక్షలు ఇవ్వడం లేదన్నారు.
Also Read : Sita Ramam: ఈ ప్రేమకావ్యం చరిత్రలో నిలిచిపోతుంది…
విద్యార్థులు కొలువులు రాక ఇబ్బందులు పడుతుంటే కేసిఆర్ అద్భుతంగా సెక్రటేరియట్ కట్టామని మట్లాడటం బాధాకరమన్నారు ఎమ్మెల్యే సీతక్క. నిజాం రాచరిక నియంతృత్వ నిరంకుశ మనస్తత్వం కలిగిన కేసీఆర్ను గద్దె దించటానికి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం స్పూర్తితో ప్రజలు మరో ఉద్యమానికి సన్నద్ధం కావాలని ఆమె వ్యాఖ్యానించారు.
Also Read : Karnataka Elections : కర్ణాటకలో మేనిఫెస్టోను విడుదల చేసిన కాంగ్రెస్