NTV Telugu Site icon

MLA Ramesh Babu : చవట దద్దమ్మలార రమేష్ బాబు బెదరడు.. పుట్టుడే ఎమ్మెల్యే కొడుకుగా పుట్టిన

Mla Ramesh Babu

Mla Ramesh Babu

రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలో బీఆర్‌ఎస్ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించగా.. ఎమ్మెల్యే రమేష్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హాట్‌ కామెంట్స్‌ చేశారు. సోషల్ మీడియా సైన్యంగా మారి, సవాలుకు ప్రతి సవాలుగా మారాలన్నారు. ఉద్యమ సమయంలో బీజేపీ, కాంగ్రెస్ వాళ్లు ఎక్కడున్నారని ఆయన ప్రశ్నించారు. చెన్నమనేని రాజేశ్వరరావు నుండి కేసీఆర్‌ వరకు ఉద్యమం చేసినవాళ్లేనని ఆయన వ్యాఖ్యానించారు. రుచి మరిగిన ఇకనుంచి గట్టిగా మాట్లాడుతా అంటూ ఆయన విపక్ష నేతలపై నిప్పులు చెరిగారు. సెస్ ఎన్నికల సమయంలో వీడియో తీసి వైరల్ చేశారని, చవట దద్దమ్మలార రమేష్ బాబు బెదరడంటూ ఆయన వ్యాఖ్యానించారు. తుపాకీ పట్టిన కుటుంబం మాదని, పుట్టుడే ఎమ్మెల్యే కుమారుడిగా పుట్టిన అంటూ ఆయన అన్నారు. ముక్కు సూటిగా మాట్లాడుతానని ఆయన అన్నారు.

Also Read : Happiest State : ఇండియాలోనే అత్యంత సంతోషకరమైన రాష్ట్రం ఏదో మీకు తెలుసా..?

ఇదిలా ఉంటే.. వేములవాడ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌పై ప్రజలు అసమ్మతితో ఉన్నారని గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి తోడు ఎమ్మెల్యే రమేష్‌ బాబు వేములవాడలో కంటే జర్మనీలోనే ఎక్కువగా ఉంటున్నారనే వాదన కూడా వినిపోస్తోంది. దీన్ని ప్రతిపక్షాలు ఆసరాగా చేసుకొని ఎమ్మెల్యేపై విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే.. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో వేములవాడ నియోజకవర్గంలో రాజకీయం రోజు రోజుకు వేడెక్కుతోంది.

Also Read : UP Govt: రోడ్లపై మతపరమైన కార్యక్రమాలకు నో.. ఈద్‌కు ముందు యోగి ప్రభుత్వం ఆంక్షలు