MLA Peddireddy: పుంగనూరు ఎస్టేట్ వ్యవహారంపై పెద్దిరెడ్డి రియాక్షన్..
- పుంగనూరులో ఎస్టేట్ అంటూ తప్పుడు ప్రచారం
- గతంలో పరువు నష్టం దావా వేశాం
- దాదాపు 75 ఎకరాలను స్థానికుల నుంచి కొనుగోలు చేశా
- పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పుంగనూరు ఎస్టేట్‌పై ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. పుంగనూరులో ఎస్టేట్ అంటూ తప్పుడు ప్రచారం చేశారన్నారు. గతంలో ఇలాంటి తప్పుడు వార్తలపై యాబైకోట్లు పరువు నష్టం దావా వేసినట్లు గుర్తుచేశారు. 2001లో దాదాపు 75 ఎకరాలను స్థానికుల నుంచి కొనుగోలు చేసినట్లు తెలిపారు. “సొంత డబ్బులతో కొన్న దానిపై అసత్య ప్రచారం చేశారు. చంద్రబాబు కుట్రలు చేయడంలో దిట్టా. వ్యక్తిత్వహననం చేయాలని రకరకాల కుట్రలు చేస్తున్నారు. 2001లోనే అక్కడ ఇళ్ళు కట్టాం.. అప్పుడే మామిడి చెట్లు పెట్టాం. ఇరవైఏళ్ళ తరువాత ఇప్పుడు అటవీ భూములు ఆక్రమించారంటూ ప్రచారం చేస్తున్నారు. గతంలో కిరణ్ కూమార్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడే విచారణ జరిగింది. అది ప్రైవేట్ భూమి అని నివేదిక ఇచ్చారు..” అని పెద్దిరెడ్డి స్పష్టం చేశారు.
READ MORE: Samsung Galaxy Z Flip 7: క్రేజీ ఫీచర్స్ తో సామ్ సంగ్ నుంచి ఫోల్డబుల్ ఫోన్.. ధర ఎంతంటే?
Also Read
- Ben Stokes: గుర్తుపట్టలేని స్థితిలో ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్.. నెటిజన్లు షాక్..
- Cockroach Janta Party: ఢిల్లీలో "కాక్రోచ్ జనతా పార్టీ" ఆందోళన.. పోలీసులు ఏం చెబుతున్నారంటే..
- Sanjay Raut: కాంగ్రెస్లో విలీనం కావాలి.. టీఎంసీ, ఎన్సీపీలకు సంజయ్ రౌత్ పిలుపు..
- Iran: యురేనియం బదిలీపై ఇరాన్ సంచలన నిర్ణయం.. పాక్కు కీలక సమాచారం!
భూమి కొనుగోలుకు సంబంధించిన రికార్డులను మీడియాకు చూయించారు. “ఒక అబద్దాన్ని పదిసార్లు చేబితే నిజం అయిపోదు… తప్పుడు ప్రచారంపై పరువు నష్టం దావా మళ్ళీ వేస్తాం.. చంద్రబాబు తాన అంటే పవన్ కల్యాణ్ తందాన అంటున్నారు.. ఎన్నికల ముందు నలబై వేల కోట్లు ఇసుకలో దోచుకున్నాడని నాపై పవన్ ప్రచారం చేశారు.. ఇప్పుడు ఎందుకు నామీద చర్యలు తీసుకోవడం లేదు.. రెడ్ శ్యాండిల్ అక్రమ రవాణా చేశారని ప్రచారం చేశారు.. అటవీశాఖ మంత్రిగా ఉండి. చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు. వైసీపీ నేతలు దొంగలు అనేలా విష ప్రచారం చంద్రబాబు, పవన్ చేస్తున్నారు. సూపర్ సిక్స్ అని చెప్పి.. ఇప్పుడు చేయాలేను అని చంద్రబాబు చేతులెత్తారు. సిగ్గులేకుండా చంద్రబాబు అబద్ధాలు చేబుతున్నారు. ఎంతమంది పోయినా ఎంత మంది వచ్చిన పార్టీకి ఏమీ కాదు. మళ్ళీ వైసీపీ గతం కంటే ఎక్కవ సీట్లలో విజయం సాధించడం ఖాయం.. జగన్, విజయమ్మతో పుట్టిన పార్టీ ఇది.. సాయిరెడ్డి రాజీనామా ఆయన వ్యక్తిగతం.. మేము గతంలో ఇచ్చిన హామీల్లో 98శాతం అమలు చేశాం.” అని ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Ben Stokes: గుర్తుపట్టలేని స్థితిలో ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్.. నెటిజన్లు షాక్..
-
Cockroach Janta Party: ఢిల్లీలో “కాక్రోచ్ జనతా పార్టీ” ఆందోళన.. పోలీసులు ఏం చెబుతున్నారంటే..
-
Sanjay Raut: కాంగ్రెస్లో విలీనం కావాలి.. టీఎంసీ, ఎన్సీపీలకు సంజయ్ రౌత్ పిలుపు..
-
Iran: యురేనియం బదిలీపై ఇరాన్ సంచలన నిర్ణయం.. పాక్కు కీలక సమాచారం!
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
ట్రెండింగ్
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!