Site icon NTV Telugu

Malreddy Ranga Reddy: చిల్లర మాటల్లో మీరు బ్రాండ్ అంబాసిడర్లు, హెడ్మాస్టర్లు..

Malreddy

Malreddy

ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్, హరీష్ రావుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కేసీఆర్ గాంధీ కాదు గాడ్సే అని దుయ్యబట్టారు. రంగారెడ్డి జిల్లాలో వేల ఎకరాల భూములను అమ్ముకున్న దరిద్రులు మీరు అంటూ ధ్వజమెత్తారు. మీ లాగా తమ సీఎం రేవంత్ రెడ్డి చిల్లర మాటలు మాట్లాడలేదని అన్నారు. తాము తిట్లు మొదలు పెడితే మీ కంటే ఎక్కువ తిట్టగలమని మల్ రెడ్డి తెలిపారు. చిల్లర మాటల్లో మీరు బ్రాండ్ అంబాసిడర్లు, హెడ్మాస్టర్లు అని దుయ్యబట్టారు.

Read Also: HYDRA: ఫిల్మ్ నగర్‌లో అక్రమ నిర్మాణాల తొలగింపు..

మూసీ పక్కన ఉన్న స్థలాలను బీఆర్ఎస్ కార్యకర్తలు ఆక్రమించుకున్నారని ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి అన్నారు. హరీష్ రావు తన మామపైన కపట ప్రేమ చూపిస్తున్నారు.. మూసీ నీళ్లు తాగిస్తే కానీ కేటీఆర్, హరీష్ రావుకు బుద్ధి రాదని తెలిపారు. రబ్బరు చెప్పులతో తిరిగిన హరీష్ రావుకు ఇన్ని ఆస్తులు ఎలా వచ్చాయి..? అని ప్రశ్నించారు. కేటీఆర్‌కు కాపలా కుక్కలా అమెయ్ కుమార్ పనిచేశాడు.. మిగిలిన వారి అక్రమాలు కూడా త్వరలోనే బయటకు వస్తాయని ఆయన పేర్కొన్నారు.

Read Also: Game Changer Teaser: మైండ్ బ్లాకయ్యేలా గేమ్ ఛేంజర్ టీజర్.. చూశారా?

సీఎం రేవంత్ రెడ్డి.. జడ్పీటీసీ స్థాయి నుంచి ముఖ్యమంత్రి అయ్యారని మల్ రెడ్డి రంగారెడ్డి అన్నారు. హరీష్ రావు నువ్వెలా మంత్రి అయ్యావో అందరికీ తెలుసు అని విమర్శించారు. కేసీఆర్ కట్టిన గుళ్లో సీఎం పూజలు చేశాడని అంటున్నావు.. యాదగిరి గుట్ట నీ అబ్బ జాగీరా అంటూ హరీష్ రావుపై విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని విమర్శిస్తే పురుగులు పడిపోతారని హాట్ కామెంట్స్ చేశారు.

Exit mobile version