NTV Telugu Site icon

Madhavaram Krishna Rao: కుల గణన సర్వే చేయడానికి వచ్చిన అధికారులను నిలదీసిన ఎమ్మెల్యే

Mla

Mla

కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కార్యాలయానికి కుల గణన సర్వే చేయటానికి అధికారులు వచ్చారు. నాడు ప్రతిపక్షంలో ఉన్న రేవంత్ రెడ్డి బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టిన సర్వేను వ్యతిరేకిస్తూ నోటికొచ్చినట్లు మాట్లాడారని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి మాట్లాడినా వీడియోను అధికారులకు చూపించి ఇప్పుడు ఏ మోహంతో రేవంత్ రెడ్డి సర్వే చేపడుతున్నారని ప్రశ్నించారు. రాజ్యాంగం ద్వారా సంక్రమించిన గోప్యత హక్కులను విరుద్ధంగా ఆస్తులు, అంతస్తులు, వాహనాలు తదితర స్థిర చర ఆస్తుల వివరాలు ఎలా సేకరిస్తారని నిలదీశారు. గడువులోపు సర్వే పూర్తీ చేయాలనే ఆతృతలో తప్పులు దొర్లే ప్రమాదం ఉందన్నారు. ప్రజలకు సరైన న్యాయం దక్కేలా వివరాలు నమోదు చేయాలని కోరారు. మొదట ప్రజాప్రతినిధుల వివరాలు సేకరించే కంటే ప్రజల వివరాలు సేకరించాలని సూచించారు. ప్రజలకు సర్వే పేరిట అన్యాయం జరిగితే బీఆర్‌ఎస్‌ పార్టీ చూస్తూ ఊరుకోదని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు హెచ్చరించారు.

READ MORE: Nag Ashwin: బాలీవుడ్ భామతో పాన్ ఇండియా లేడీ ఓరియెంటెడ్ సినిమా!!

ఇదిలా ఉండగా.. ఆదివారం హనుమకొండలో కేటీఆర్ మాట్లాడుతూ.. బీసీల ఓట్ల కోసం ఇప్పుడు కుల గణన అని కొత్త నినాదం ఎత్తుకున్నారని, సర్వే కోసం ఇంటికి వెళ్తే అధికారులను జనం నిలదీస్తున్నారన్నారు. బీసీలకు సబ్ ప్లాన్ అని చెప్పారని.. ఒకటన్న అమలు అయ్యాయా? అని ప్రశ్నించారు. కుల గణనలో కేవలం కులాలకు సంబంధించిన సమాచారం మాత్రమే తీసుకోండి.. ఆర్థిక అంశాలను ఆ ఫార్ములా నుంచి తొలగించండని తెలిపారు. కులాలకు సంబంధించిన వివరాలు సేకరించేలాగా ఫామ్ రూపొందించండని డిమాండ్ చేశారు. కుల గణన చేసిన 42% రిజర్వేషన్లు అమలు అయ్యేలాగా చేయాలని.. తమ ఎమ్మెల్యేల మీద దాడులు చేయడం కాదన్నారు. ఇచ్చిన మాటను మీద నిలబెట్టుకోవాలని సూచించారు.

Show comments