నర్సాపూర్ లో ఎమ్మెల్యే మదన్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ నెల 21న ప్రకటించిన బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాలో నర్సాపూర్ టికెట్ పెండింగ్ లో పార్టీ అధిష్టానం పెట్టింది. గత వారం నుంచి ఎమ్మెల్యే వరుసగా ఆందోళనలు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ రెడ్డి మాట్లాడుతూ.. నాకు రాజకీయ భిక్ష పెట్టింది కేసీఆర్ అని ఆయన తెలిపారు. అయితే, పరోక్షంగా సునీతా లక్ష్మరెడ్డిపై మదన్ రెడ్డి వ్యాఖ్యలు చేశాడు.
ఆమెకి మహిళా కమిషన్ చైర్మన్ పదవి ఇచ్చి క్యాబినెట్ హోదా కల్పించారు అని నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి అన్నారు. ఆమెకి ఎమ్మెల్సీ ఇచ్చిన నాకు ఇబ్బంది లేదు.. నాకు మాత్రం నర్సాపూర్ ఎమ్మెల్యే టికెట్ కావాలి అంటూ ఆయన డిమాండ్ చేశాడు. ఈ సారి నర్సాపూర్ లో టికెట్ నాకే.. టికెట్ ఎందుకు ఆపారో నాకు తెలియదు.. మా ఇద్దరి మధ్య టఫ్ ఫైట్ లేదు.. ఈ సారి వార్ వన్ సైడ్.. నేను పార్టీ మారే ప్రసక్తి లేదు.. నాకే ఈ సారి ఎమ్మెల్యే టికెట్ వస్తుందని ఎమ్మెల్యే మదన్ రెడ్డి తెలిపారు.
Read Also: Chandrababu: రెండు ప్రధాన అంశాలపై ఢిల్లీకి వచ్చా.. అది తేలాకే ఎన్నికలకు వెళ్లాలి..
అయితే, బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఈ నెల 21వ తారీఖున ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. ఈ సందర్భంగా నాలుగు నియోజకవర్గాలను పెండింగ్ లో పెట్టారు.. 1, జనగామ, 2 నర్సాపూర్, 3 గోషామాహాల్, 4 నాంపల్లి స్థానాలకు ఇంకా అభ్యర్థులను ఖరారు చేయలేదు. దీంతో ఈ నియోజక వర్గాల ఎమ్మెల్యేలు తమకు ఎందుకు సీట్లు కేటాయించలేదనే దానిపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.