MLA Kunamneni Sambasiva Rao on PM Modi: బీజేపీ త్రాచుపాము లాంటిదని, తలలోనే కాదు తోకలోనూ ఆ పార్టీకి విషం ఉంటుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోడీకి అధికార పిచ్చి పట్టిందని, అధికారం కోసం దేశాన్ని కండఖండాలుగా నరికే ఆలోచనతో బీజేపీ ఉందన్నారు. ఎన్నికల ప్రచారంలో అభివృద్ధి ప్రచారం చేయకుండా.. హిందూ, ముస్లింలను రెచ్చగొట్టే ప్రచారం చేశారని మండిపడ్డారు. మోడీకి ఎన్నికల కమిషన్ అన్న కూడా లెక్కలేకుండా పోయిందన్నారు. దేశంలో బీజేపీ పేరు మీద కాకుండా.. మోడీ మేనిఫెస్టో, మోడీ గ్యారెంటీ అంటూ ప్రచారం చేశారని కూనంనేని ఫైర్ అయ్యారు.
ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ… ‘పదేళ్ల కాలంలో కేంద్ర బీజేపీ ప్రభుత్వం తెలుగు రాష్ట్రాలకు ఒక్క విభజన హామీ కూడా నెరవేర్చలేదు. చేసింది ఏమీ చెప్పలేక ముస్లిం రిజర్వేషన్ల సాకుతో ప్రజలను బీజేపీ రెచ్చగొడుతుంది. రాజ్యాంగాన్ని మార్చమని మోడీ అంటుంటే.. ఆయన శిష్యులు మాత్రం మారుస్తామంటున్నారు. రాజ్యాంగాన్ని మార్చమంటూనే.. ముస్లిం రిజర్వేషన్లు మారుస్తామని మోడీ చెప్పడం వెనుక ఆంతర్యం ఏంటి?. ఎన్నికల ప్రచారంలో అభివృద్ధి ప్రచారం చేయకుండా.. హిందూ-ముస్లింలను రెచ్చగొట్టేలా ప్రచారం చేశారు. ప్రధాని నరేంద్ర మోడీకి ఎన్నికల కమిషన్ అన్న కూడా లెక్కలేకుండా పోయింది. దేశంలో శ్రీరామనవమి కంటే ముందే రాముని అక్షంతలను పంపిణీ చేశారు’ అని అన్నారు.
Also Read: Boora Narsaiah Goud: 75 శాతం బీసీలను మమతా బెనర్జీ వెన్నుపోటు పొడిచారు!
‘దేశంలో బీజేపీ పేరు మీద కాకుండా.. మోడీ మేనిఫెస్టో, మోడీ గ్యారెంటీ అంటూ ప్రచారం చేశారు. నరేంద్ర మోడీకి పదవీకాంక్ష పీక్ స్టేజ్‌కు పోయింది, అందుకే 2047లో కూడా నేనే ప్రధానిని అంటున్నారు. మోడీకి అధికార పిచ్చి పట్టింది. అధికారం కోసం దేశాన్ని కండఖండాలుగా నరికే ఆలోచనతో బీజేపీ ఉంది. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుస్తుంది. దేశంలో బీజేపీ త్రాచుపాము లాంటిది.. దానికి తలలోనే కాదు తోకలోను విషం ఉంది. తెలంగాణలో కొత్త ప్రభుత్వానికి అనేక సమస్యలు ఉన్నాయి. నిధులు లేక అన్ని శాఖల్లో బకాయిలు పేరుకపోతున్నాయి. కేసీఆర్ కుర్చీ దిగిపోయి అదృష్టవంతుడయ్యారు. ఆయన పాపాలు ఇప్పటి ప్రభుత్వం మోస్తుంది. కొత్త ప్రభుత్వం ఆర్థిక సంక్షేమం నుంచి బయట పడాలంటే.. అఖిలపక్షం మేధావుల సలహాలు, సూచనలు తీసుకోవాలి. వరికి 500 బోనస్.. సన్న బియ్యంకే కాదు అన్ని బియ్యాలకు ఇవ్వాలి’ అని కూనంనేని పేర్కొన్నారు.