Kotamreddy Sridhar Reddy: ఓ చేతితో పది రూపాయలు ఇచ్చి.. మరో చేత్తో వంద లాక్కుంటున్నారంటూ.. వైఎస్ జగన్ సర్కార్‌పై విమర్శలు గుప్పించారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.. ఐదేళ్లు జగన్ పాలనను ప్రజలు చూశారు.. మా ప్రచారంలో ప్రజలంతా ఇదే చెబుతున్నారు.. నిత్యావసరాలు, విద్యుత్ చార్జీలతో పాటు అన్నింటి మీదా ధరలు పెరిగాయి.. ఇళ్లు కట్టుకోవాలంటే ఇసుక అదనపు భారంగా మారింది.. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు రుణాలు రావడం లేదు అని ఆవేదన వ్యక్తం చేశారు. అన్న క్యాంటీన్ లను మూసివేయడం ఎంతవరకూ సబబని ప్రజలు అడుగుతున్నారు.. రంజాన్ తోఫా.. క్రిస్మడ్.. సంక్రాంతి కానుక ఇవ్వడం లేదు.. చెత్త పేరుతో పన్ను వేశారు. ప్రభుత్వ ఉద్యోగులు.. అంగన్‌వాడీలు.. సమగ్ర శిక్ష.. మునిసిపల్ కార్మికులు ఆవేదనతో వున్నారు.. ఇచ్చిన హామీని నిలబెట్టు కోవాలని కోరుతున్నారని పేర్కొన్నారు.
Read Also: Naa Saami Ranga : దుమ్ము దుకాణం అంటున్న నాగార్జున.. కొత్త సాంగ్ ప్రోమో రిలీజ్..
ఉద్యోగాలంటే వాలంటీర్ పోస్టులు కాదు.. వాలంటీర్లు కూడా సంతృప్తిగా లేరు.. ఉద్యోగ భద్రత లేదు.. అందుకే వారు చంద్రబాబు రావాలని కోరుకుంటున్నారని తెలిపారు కోటంరెడ్డి.. ప్రైవేటు కంపెనీలు రాకపోవడంతో నిరుద్యోగం పెరిగింది. ఈ ఎన్నికల్లో టీడీపీని గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని భావిస్తున్నారు.. త్వరలో ఎన్నికల నోటిఫికేషన్ రానుంది.. అధికారుల ధోరణిలో కూడా మార్పు వచ్చింది.. టీడీపీ నేతలతో వాళ్లు టచ్ లో ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజలంతా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని పిలుపునిచ్చారు. వ్యాపారులను వైసీపీ ప్రభుత్వంలో ఇబ్బంది పెడుతున్నారు.. వ్యాపారుల నుంచి వ్యాపారాన్ని వైసీపీ పెద్దలు లాక్కుంటున్నారని ఆరోపణలు గుప్పించారు.
Read Also: MLA Jonnalagadda Padmavathi: వైసీపీ ఎమ్మెల్యే పద్మావతి హాట్ కామెంట్స్..
సిలికా.. తెల్ల రాయిపై కన్ను పడింది.. ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్ లో ధర రావడంతో.. అక్రమంగా యజమానుల నుంచి గనులు స్వాధీనం చేసుకుని దోచుకుంటున్నారని విమర్శించారు కోటంరెడ్డి.. మళ్లీ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే.. అందరినీ ఇబ్బంది పెడతారు. అందరూ ఆలోచించి నిర్ణయం తీసుకోవాలన్నారు. ప్రస్తుతం వైసీపీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. ఏడాది క్రితం నేను అన్న మాటలే ఇప్పుడు వింటున్నారని తెలిపారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి..