Site icon NTV Telugu

Kotamreddy Sridhar Reddy: తగ్గేదే లే….నాకు గన్ మెన్లు అవసరంలేదు

Kotamreddy

Kotamreddy

అధికార వైసీపీ-రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరుకుంది. మా బావ కాకాణి గోవర్థన్ రెడ్డిని నాలుగు ప్రశ్నలు అడిగితే 40 తిట్లు తిట్టారు.. ఆయన తిట్లకు మళ్లీ సమాధానం చెబుతానన్నారు. నాకు ఉన్న నలుగురు గన్ మెన్ లలో ఇద్దరిని తొలగించారు. పోలీస్ కార్యాలయం నుంచి ఆదేశాలు వచ్చాయని చెప్పారు. ఎవరి ఆదేశాలతో ఈ పని చేశారో తెలియదు. నాకు చాలా చోట్ల నుంచి నాకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. నన్ను మానసికంగా ఇబ్బంది పెట్టేందుకే ఇలా చేశారు. నాకు గన్‌మెన్లు తగ్గించిన సర్కార్‌కు నేను రిటర్న్‌ గిఫ్ట్ ఇస్తున్నా.. ఇద్దరు గన్‌మెన్లను తొలగించారు, మిగిలిన ఇద్దరు గన్‌మెన్లు నాకొద్దు.. గన్‌మెన్లను తొలగించినంత మాత్రాన నేను భయపడను.. నాగొంతు పెరిగేదే తప్ప తగ్గేది లేదన్నారు కోటంరెడ్డి.

Read Also: Dead Body In Fridge: రెండేళ్లుగా తల్లి శవాన్ని ఫ్రిజ్‎లోనే పెట్టిన కూతురు

నాకు ఇప్పుడు ఉన్న ఇద్దరు గన్ మెన్ లను కూడా తిప్పి పంపుతున్నా. వారిని రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగిస్తున్నా. నాకు గన్ మెన్ లు అక్కర లేదు. నన్ను ఏమైనా చేసుకోండి. రోజు రోజుకూ నా గొంతు వినిపిస్తూనే ఉంటా. ఎంత దూరమైనా వెళతానన్నారు. గన్ మెన్ లను తొలగించినంత మాత్రాన నన్ను మానసికంగా ఏమీ చేయలేరన్నారు. తగ్గేదే లే. నామీద మంత్రులతో విమర్శల దాడి చేయిస్తున్నారు.ఒక ఎం.ఎల్.ఏ ని ఒంటరి వాడిని చేసి విమర్శిస్తున్నారు. ఏ.ఎస్.పి. పచ్చి అబద్దాలు చెబుతున్నారు. గన్ మెన్ లను తీయలేదని అంటున్నారు. నిన్ననే ఇద్దరిని తీసేశారు. అయినా తొలగించలేదని చెప్పడం సరికాదన్నారు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.

Read Also: House Catches Fire: ఇంటి పైకప్పుకు మంటలు.. 3 ఏళ్ల బాలిక సజీవ దహనం

 

Exit mobile version