NTV Telugu Site icon

MLA Kavvampally: ఫోన్ ట్యాపింగ్ ‌నీచాతి నీచమైన చర్య..

Kavvampalli

Kavvampalli

మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, కాంగ్రెస్ పార్లమెంటు అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. డీసీపీ రాధాకిషన్ ఫోన్ ట్యాపింగ్లో తన పేరు ఉందని చెప్పాడన్నారు. తన ఫోన్ ట్యాపింగ్ అయ్యిందని ‌నిన్నటి నుండి చాల బాధపడ్డానని తెలిపారు. ఫోన్ ట్యాపింగ్తో మాజీ ముఖ్యమంత్రి, కేటీఆర్, హారీష్ రావు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసారని దుయ్యబట్టారు. ఫోన్ ట్యాపింగ్ ‌నీచాతి నీచమైన చర్య అని మండిపడ్డారు. నా ఫోన్ ట్యాపింగ్ చేయడానికి నేనేమైనా తీవ్రవాదినా? అని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫోన్ ట్యాపింగ్ వలన‌ తనకు అత్యంత దగ్గరి వ్యక్తి, తన పర్సనల్ అసిస్టెంట్ ని‌ దూరం చేసుకున్నట్లు చెప్పారు.

Telangana Formation Celebrations: ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల ఏర్పాట్లు- సీఎస్

పదేండ్లు పాలించిన ముఖ్యమంత్రి ఫోన్ ట్యాపింగ్ వలన తెలంగాణ రాష్ర్ట్రానికి అపవాదు తీసుకువచ్చాడని ఎమ్మెల్యే మండిపడ్డారు. బండి సంజయ్ ఫోన్ ట్యాపింగ్ జరిగిందని తెలిసినా.. ఇప్పటి వరకి‌ స్పందించలేదని పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ పై‌ హైకోర్టుని ఆశ్రహిస్తానని చెప్పారు. సి విజిల్ యాప్లో ఇండ్లలో‌ డబ్బులు ఉన్నాయని ఫిర్యాదు చేస్తే పట్టించుకోలేదన్నారు. తన భార్యతో మాట్లాడిన మాటలు కూడా ఫోన్ ట్యాపింగ్ వలన‌ బహిర్గతం అయ్యాయని వాపోయారు. బీఆర్ఎస్ ఎన్ని కుట్రలు చేసినా చీత్కరించారని అన్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పై కేటీఆర్, హరీష్ రావులు ఎందుకు‌ స్పందించడం లేదని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ప్రశ్నించారు.

Rajkot game zone: డీఎన్‌ఏ టెస్ట్ రిపోర్టు.. గేమ్ జోన్ యజమాని ఏమయ్యాడంటే..!

మరోవైపు.. కాంగ్రెస్ ‌పార్లమెంటు అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు మాట్లాడుతూ, స్వచ్ఛతకు మారుపేరు కవ్వంపల్లి సత్యనారాయణ అని అన్నారు. నీచ రాజకీయాలు చేసి‌ మరోసారి‌ గద్దెనెక్కాలని కేసీఆర్ చూశారని.. కేసీఆర్ వచ్చాకనే వాట్సప్, ఫేస్ ఆప్ ద కాల్ ఎక్కువగా వాడారని ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీని రద్దు చేయాలని కోరారు.