Site icon NTV Telugu

MLA Jagga Reddy : వీఆర్‌ఏల డిమాండ్లపై సీఎం కేసీఆర్‌కు జగ్గారెడ్డి లేఖ

Jaggareddy

Jaggareddy

ప్రభుత్వం వీఆర్‌ఏల డిమాండ్స్‌ను వెంటనే అమలు చేయాలని సీఎం కేసీఆర్‌కు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి లేఖ రాశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చాలా రోజుల నుండి వీఆర్ఏ లు వారి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నారని, ఇందులో భాగంగా సమ్మె కూడ చేశారన్నారు. ప్రభుత్వం వారి డిమాండ్స్ నెరవేరుస్తామని హామీ కూడ ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు. వెంటనే వీఆర్ఏలు కోరిన్నట్లు పే స్కేల్ పెంచాలన్నారు. పదో తరగతి పాసైనవారికి అటెండర్ గ్రేడ్ పే స్కేల్ పెంచి 22వేల జీతం ఇవ్వాలని ఆయన అన్నారు. ఇంటర్ పాసైన వీఆర్ఏలకు అసిస్టెంట్ గ్రేడ్ పే స్కేల్ ఇచ్చి 26వేల జీతం ఇవ్వాలని ఆయన కోరారు.

Also Read : Narendra Modi : హెల్త్‌కేర్‌పై ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు.!

అంతేకాకుండా.. గ్రామీణ ప్రాంతాల్లో పని చేసే వీఆర్ఏలకు పని ఒత్తిడి ఎక్కువ ఉంటుందని, ఎంఆర్వో, ఆర్డీఓ, జాయింట్ కలెక్టర్, కలెక్టర్ స్థాయి వారు కూడ వీరితో పని చేయించుకుంటారని ఆయన వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లో చాలా పని చేస్తూ చాలా కష్టపడుతారని, 10వేల 500 రూపాయల జీతం వీరికి సరిపోవు అని ఆయన వ్యాఖ్యానించారు. వచ్చే జీతం బైక్ లో పెట్రోల్ పోసుకొని తిరుగడానికే సరిపోతాయని, ఇంత పని భారం ఉన్న వీఆర్ఏ లకు ప్రభుత్వం వెంటనే పే స్కేల్ పెంచి జీతాలు ఇవ్వాలన్నారు.

Also Read : Ravanasura: ఇప్పటివరకూ రవితేజని హీరోగా చూశారు… ఇకపై ‘రావణాసుర’గా చూస్తారు

వీఆర్ఏ లు కోరుతున్నట్లు ఎక్స్పీరియన్స్ ఉన్నవారికి ప్రొమోషన్స్ ఇవ్వాలన్నారు. అలాగే వారసత్వ ఉద్యోగాలకు అవకాశం కల్పించేలా జీవో ఇవ్వాలని, సమ్మె చేసిన 80 రోజుల జీతం కూడా ఇవ్వాలని, అసెంబ్లీ సమావేశాల్లో వీఆర్ఏ ల సమస్య పై ప్రస్తావన తీసుకొని రావడం జరిగిందన్నారు.

అలాగే మంత్రి కేటీఆర్ వీఆర్ఏ లు సమ్మె చేస్తున్న సమయంలో చర్చలకు పిలిచి వీఆర్ఏ ల డిమాండ్స్ నెరవేరుస్తామని హామీ ఇచ్చారన్నారు. కానీ ఎందుకో వీఆర్ఏ ల సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదని, అందుకే ఈ లేఖ ద్వారా మరోసారి మీ దృష్టికి తీసుకొచ్చి గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నానన్నారు. ఇప్పటికైన వెంటనే వీఆర్ఏ ల డిమాండ్స్ ను నెరవేర్చాలని కోరుతున్నానని లేఖలో ఆయన కోరారు.

Exit mobile version