Ravanasura: ఇప్పటివరకూ రవితేజని హీరోగా చూశారు… ఇకపై ‘రావణాసుర’గా చూస్తారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాస్ మహారాజా రవితేజ అనగానే హై ఎనర్జీ పెర్ఫార్మెన్స్, జోష్ ఫుల్ డైలాగులు, స్కై టచింగ్ హీరోయిజం గుర్తొస్తుంది. ఈసారి మాత్రం అలా కాదు, ఇప్పటివరకూ హీరోని చూశారు ఈసారి మాత్రం విలన్ ని చూడండి అంటూ రవితేజ ఏప్రిల్ 7న ఆడియన్స్ ముందుకి రాబోతున్నాడు. సుధీర్ వర్మ దర్శకత్వంలో రవితేజ నటిస్తున్న ‘రావణాసుర’ సినిమాపై భారి అంచనాలు ఉన్నాయి. రవితేజ ఇప్పటికే రెండు 100 కోట్ల సినిమాలు చెయ్యడంతో ‘రావణాసుర’పై అంచనాలు మరింత పెరిగాయి. మీరు ఎన్ని ఎక్స్పెక్టేషన్స్ అయినా పెట్టుకోండి, వాటిని క్రాస్ చేసి హిట్ కొడతాను అనే నమ్మకం ఆడియన్స్ లో కలిగిస్తే రవితేజ ‘రావణాసుర’ టీజర్ బయటకి వచ్చింది. సుధీర్ వర్మ స్టైల్ ఆఫ్ మేకింగ్ కి, రవితేజ స్క్రీన్ ప్రెజెన్స్ కలవడంతో రావణాసుర టీజర్ సూపర్బ్ గా ఉంది. విజయ్ కార్తీక్ కెమెరా వర్క్, హర్షవర్ధన్-భీమ్స్ మ్యూజిక్, నవీన్ నూలి ఎడిటింగ్ స్టైల్ రావణాసుర టీజర్ ని స్టైలిష్ యాక్షన్ ఫిల్మ్ గా మార్చాయి. సుశాంత్, జయరామ్ ల లుక్ కొత్తగా ఉంది.
Read Also: Project K: యాక్షన్ ఎపిసోడ్ షూటింగ్ లో అమితాబ్ కి ప్రమాదం…
Also Read
- Dada: బాలయ్య ఫ్యాన్స్కి గుడ్ న్యూస్... హైదరాబాద్లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
- Haindava Teaser: "ఆ దేవుళ్ల విగ్రహాల్లో దాగి ఉన్న రహస్యమేంటి?".. ‘హైందవ’ టీజర్ చూశారా!
- Prabhas Surprise: ఇమాన్వీకి ప్రభాస్ బర్త్డే గిఫ్ట్.. ఫిదా అయిన హీరోయిన్!
- Radha Krishna: చాలా కాలం తర్వాత మీడియా ముందుకు రాధే శ్యామ్ దర్శకుడు
ముగ్గురు హీరోయిన్స్ లో ఒక్కరి లుక్ ని కూడా పూర్తి స్థాయిలో ప్రెజెంట్ చెయ్యలేదు కానీ కొంతమంది అమ్మాయిల డెడ్ బాడీస్ ని మాత్రం క్లియర్ గా చూపించారు. చనిపోయింది హీరోయిన్లే అని చెప్పకుండా ఉంటే అది చాలు కానీ రవితేజ మాత్రం నెగటివ్ షెడ్ లో నెవర్ బిఫోర్ అనే రేంజులో ఉన్నాడు. స్టైలిష్ గా కనిపిస్తూనే నెగటివ్ షేడ్ ని రవితేజ క్యారీ చేసిన విధానం ఇంప్రెస్ చేసింది. ఇప్పటివరకూ కామెడి, సీరియస్ రోల్స్ లో మాత్రమే కనిపించిన రవితేజని విలనిష్ టచ్ ఉన్న రోల్ లో చూడడం కొత్తగా అనిపించడం గ్యారెంటీ. టీజర్ ఎండ్ లో “సీతని తీసుకోని వెళ్లాలి అంటే సముద్రం దాటితే సరిపోదు, ఈ రావణాసురుడిని కూడా దాటాలి” అనే డైలాగ్ రవితేజ క్యారెక్టర్ ని ప్రెజెంట్ చేస్తుంది. ఈ టీజర్ చూస్తుంటే రవితేజ 100 కోట్ల హ్యాట్రిక్ కొట్టడం గ్యారెంటీ అనిపిస్తుంది. మొత్తానికి నిమిషమున్నర ఉన్న టీజర్ తో సెన్సేషన్ క్రియేట్ చేసిన రావణాసుర టీమ్, ఏప్రిల్ 7న ఏ రేంజ్ హిట్ అందుకుంటారు అనేది చూడాలి.
Welcoming you all to my world!
The #RAVANASURA world 🔥Here’s the #RavanasuraTeaser :))
Looking forward to seeing you all at the theatres this April 7th 🤗🤗🤗 pic.twitter.com/TKcZHrVeZJ
— Ravi Teja (@RaviTeja_offl) March 6, 2023
తాజావార్తలు
-
CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
-
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
-
Dada: బాలయ్య ఫ్యాన్స్కి గుడ్ న్యూస్… హైదరాబాద్లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
-
Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..