Site icon NTV Telugu

MLA Jagga Reddy : కేంద్రం ఈడీ, కేసీఆర్ ఏసీబీ వాడుతున్నారు.. మా దగ్గర ఏ శాఖ లేదు.. మేమేం చేస్తాం

Jagga Reddy

Jagga Reddy

మరోసారి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై విమర్శలు గుప్పించారు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే తూర్ప జగ్గారెడ్డి. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ ఈడీ, ఐటీ లను వాడుతుందన్నారు. కేసీఆర్‌కు తప్పక ఆయన ఏసీబీని వాడుతున్నారన్నారు. కేంద్రం ఈడీ, కేసీఆర్ ఏసీబీని వాడుతున్నారన్నారు. ఇద్దరు కొట్లాటతో ప్రజలకు ఏం లాభమని ఆయన ప్రశ్నించారు. మా దగ్గర ఏ శాఖ లేదు..మేమేం చేస్తామంటూ ఆయన బీజేపీ, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాలకు చురకలు అంటించారు. మా కొట్లాట లోక కల్యాణం కోసమని, బీజేపీ.. టీఆర్‌ఎస్‌ కొట్లాట లోక వినాశనం కోసమని ఆయన మండిపడ్డారు.
Also Read : Bandi Sanjay : తనిఖీలు చేయాలా వద్దా..? దొంగ అంటే భుజాలు తడుముకున్నట్లుగా ఉంది

మా అంతర్గత పంచాయతీ లోక కల్యాణం కోసమని, మల్లారెడ్డి ఇప్పుడు సంపాదించిండా పైసలు.. టీడీపీలో ఉన్నప్పటి నుండి సంపాదించాడు.. ఎనిమిది యేండ్లలో లేని దాడులు ఇప్పుడు ఎందుకు చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. 8 ఏండ్ల నుండి ఎందుకు ఐటీ అధికారులు దాడి చేయలేదని, దేవుళ్ళ కాలంలో కూడా క్యాసినో.. క్లబ్బు లు ఉన్నాయన్నారు. గోవాలో క్యాసినో ఫ్రీ అని, అక్కడ అధికారంలో ఉన్నది బీజేపీనే కదా అని ఆయన వ్యాఖ్యానించారు. అక్కడ ఆడేవాళ్ళను… తెలంగాణకు వచ్చి దాడులు ఎందుకని ఆయన ప్రశ్నించారు. గోవాలో ఆడించేది మీరు..ఇక్కడ దాడులు చేసేది మీరే అంటూ జగ్గారెడ్డి ధ్వజమెత్తారు.
Also Read : FIFA World Cup: మెట్రోలో పాటలు, డ్రగ్స్, డ్రెస్ సరిగ్గా లేకున్నా జైలు పాలే

Exit mobile version