NTV Telugu Site icon

MLA Gorantla Butchaiah Chowdary: బీజేపీతో పొత్తు ఇంకా ఖరారు కాలేదు.. ఓటింగ్‌ శాతం ప్రకారం సీట్లు..?

Mla Gorantla Butchaiah Chow

Mla Gorantla Butchaiah Chow

MLA Gorantla Butchaiah Chowdary: ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే ఎన్నికల్లో పొత్తులపై ఢిల్లీ స్థాయిలో చర్చలు సాగుతున్నాయి.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. ఢిల్లీ వెళ్లి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో పాటు జేపీ నడ్డాతో చర్చలు జరిపివచ్చారు.. ఇక, పవన్‌ కల్యాణ్‌ కూడా ఢిల్లీ వెళ్తారనే ప్రచారం సాగుతోంది.. ఈ నేపథ్యంలో కీలక వ్యాఖ్యలు చేశారు టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి.. బీజేపీతో పొత్తు ఇంకా ఖరారు కాలేదన్న ఆయన.. బీజేపీతో కలవడమా? లేదా బయటనుంచి మద్దతు ఇవ్వటమా? అనేది ఇంకా నిర్ణయం అవ్వాలని అన్నారు.. ఇక, గతంలో రాష్ట్రంలో బీజేపీకి వచ్చిన ఓటింగ్ శాతం ప్రకారం సీట్లు కేటాయింపు ఉండొచ్చు అనే అభిప్రాయపడ్డారు.. రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి.. రాష్ట్రంలోని 175 సీట్లలో ఎక్కువ త్యాగం టీడీపీనే చేయాల్సి ఉంటుందని అన్నారు. జనసేన పార్టీ క్యాడర్ పరంగా ఇంకా బలపడాలన్నారు. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఎప్పటికైనా రాజ్యాధికారం చేపట్టాలని కోరుకుంటున్నారని తెలిపారు.. ఇక, రాజమండ్రి రూరల్ కి నాల్గో కృష్ణుడుగా మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ వచ్చారు అంటూ ఎద్దేవా చేశారు.. మంత్రి వేణు పర్యటనలో ప్రతీ పంచాయతీ నుంచి లక్ష రూపాయలు ఖర్చు చేస్తున్నారని విమర్శలు గుప్పించారు టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి.

Read Also: Fire Accident : ఢిల్లీలోని గాంధీ నగర్‌లోని ఫర్నీచర్ మార్కెట్లో భారీ అగ్నిప్రమాదం

Alliance with BJP not finalized yet - MLA Butchaiah Chowdary | Ntv