MLA Gorantla Butchaiah Chowdary: బీజేపీతో పొత్తు ఇంకా ఖరారు కాలేదు.. ఓటింగ్ శాతం ప్రకారం సీట్లు..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLA Gorantla Butchaiah Chowdary: ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే ఎన్నికల్లో పొత్తులపై ఢిల్లీ స్థాయిలో చర్చలు సాగుతున్నాయి.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. ఢిల్లీ వెళ్లి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో పాటు జేపీ నడ్డాతో చర్చలు జరిపివచ్చారు.. ఇక, పవన్ కల్యాణ్ కూడా ఢిల్లీ వెళ్తారనే ప్రచారం సాగుతోంది.. ఈ నేపథ్యంలో కీలక వ్యాఖ్యలు చేశారు టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి.. బీజేపీతో పొత్తు ఇంకా ఖరారు కాలేదన్న ఆయన.. బీజేపీతో కలవడమా? లేదా బయటనుంచి మద్దతు ఇవ్వటమా? అనేది ఇంకా నిర్ణయం అవ్వాలని అన్నారు.. ఇక, గతంలో రాష్ట్రంలో బీజేపీకి వచ్చిన ఓటింగ్ శాతం ప్రకారం సీట్లు కేటాయింపు ఉండొచ్చు అనే అభిప్రాయపడ్డారు.. రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి.. రాష్ట్రంలోని 175 సీట్లలో ఎక్కువ త్యాగం టీడీపీనే చేయాల్సి ఉంటుందని అన్నారు. జనసేన పార్టీ క్యాడర్ పరంగా ఇంకా బలపడాలన్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎప్పటికైనా రాజ్యాధికారం చేపట్టాలని కోరుకుంటున్నారని తెలిపారు.. ఇక, రాజమండ్రి రూరల్ కి నాల్గో కృష్ణుడుగా మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ వచ్చారు అంటూ ఎద్దేవా చేశారు.. మంత్రి వేణు పర్యటనలో ప్రతీ పంచాయతీ నుంచి లక్ష రూపాయలు ఖర్చు చేస్తున్నారని విమర్శలు గుప్పించారు టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి.
Read Also: Fire Accident : ఢిల్లీలోని గాంధీ నగర్‌లోని ఫర్నీచర్ మార్కెట్లో భారీ అగ్నిప్రమాదం
Also Read
తాజావార్తలు
-
Ben Stokes: క్రికెట్ ప్రపంచాన్ని షాక్‌కు గురిచేసిన బెన్ స్టోక్స్.. రిటైర్మెంట్ ప్రకటన..
-
KTR: మోసపోతే గోసపడుతాం అంటే ఇదే.. 2028లో మళ్లీ కేసీఆరే సీఎం
-
AB de Villiers: ‘నా లైఫ్‌లో చూసిన అత్యుత్తమ బ్యాట్స్‌మెన్స్ వీరే’.. టాప్ 3లో ఎవరెవరంటే..
-
Idupu Kayitham : రచ్చ రచ్చ చేస్తున్న ‘ఇడుపు కాయితం’.. నేషనల్ ఇష్యూ చేశారంటూ నరేశ్ ఫైర్!
-
MEA: కరాచీ దాడిని భారత్‌పై నెట్టొద్దు.. పాక్‌పై ఘాటు వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్‌గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!