NTV Telugu Site icon

Gadikota Srikanth Reddy: ఎన్నడూ చూడని అభివృద్ధి చేశా.. నాకు ఓటేయండి..

Gadikota

Gadikota

Gadikota Srikanth Reddy: అన్నమయ్య జిల్లా రాయచోటి సెట్టింగ్ ఎమ్మెల్యే, వైసీపీ అభ్యర్థి గడికోట శ్రీకాంత్ రెడ్డి.. కీలక వ్యాఖ్యలు చేశారు.. మీడియాతో మాట్లాడిన ఆయన.. రాయచోటిలో గతంలో ఎన్నడూ చూడని అభివృద్ధిని చేశాం.. రాయచోటి మున్సిపాలిటీని స్పెషల్ గ్రేట్ వన్ మున్సిపాలిటీగా చేశాం.. రాయచోటిని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేశాం.. పక్క ప్రాంతాలైన రాజంపేట, మదనపల్లిలో పోటీ చేసే అభ్యర్థులు.. మేం జిల్లా కేంద్రం చేస్తాం మాకు ఓటేయండి అని అడుగుతున్నారు.. నేను జిల్లా కేంద్రం చేశాను.. నాకు ఓటేయండి అని నేను అడుగుతున్నాను అన్నారు.

Read Also: Beauty Tips : పుదీనాతో మెరిసే చర్మం మీ సొంతం..

ఓటు హక్కు వజ్రాయుధం లాంటిది.. ఐదేళ్లకు ఒకసారి వచ్చే ఎన్నికల్లో మంచి అభ్యర్థిని ఎన్నుకోండి.. ఎవరు అభివృద్ధి చేశారో, చేస్తారో అనే వాళ్ళనే ఎన్నుకోండి అని పిలుపునిచ్చారు శ్రీకాంత్‌రెడ్డి.. నిరంతరం కొనసాగిన పథకాల్లో భాగంగా జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుండి 125 సార్లు ఆయన బటన్ నొక్కి 2 లక్షల 70 వేల కోట్లు నిధులను డీబీటీ ద్వారా ప్రజలకు చేరవేశారని వెల్లడించారు. పేద ప్రజలు ఆఫీసుల చుట్టూ తిరగకుండా, లంచాలకు తావు లేకుండా.. నేరుగా వారి వారి ఖాతాల్లో డబ్బులను జమ చేశాం.. జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన వివిధ పథకాలు ద్వారా ప్రజలకు అందాల్సిన డబ్బులు విడుదల కానేకుండా కోర్టులో టీడీపీ వాళ్లు అడ్డుకున్నారు అని ఫైర్‌ అయ్యారు. రేపు ఎన్నికలు అనే రోజు కూడా టీడీపీ హయాంలో పసుపు, కుంకుమ డబ్బులను రిలీజ్ చేశారు.. కానీ, ఇప్పుడు పేద ప్రజలకు, విద్యార్థులకు రావాల్సిన నిధులను విడుదల కానీయకుండా ఎందుకు చేస్తున్నారు? అని నిలదీశారు. ఎన్నికల కమిషన్ అనుమతితో విడుదల కావాల్సిన నిధులను.. విడుదల కానేకుండా టీడీపీనే కోర్టులో అడ్డుకుందని విమర్శించారు. ఎన్నికలు అయిపోయిన మరుసటి రోజు 14వ తేదీన డబ్బులు విడుదల చేస్తామంటున్నారు. కానీ, 14వ తేదీ రోజునైనా డబ్బులు విడుదలకు టీడీపీ సహకరించాలని విజ్ఞప్తి చేశారు రాయచోటి సెట్టింగ్ ఎమ్మెల్యే, వైసీపీ అభ్యర్థి గడికోట శ్రీకాంత్ రెడ్డి..