Site icon NTV Telugu

MLA Balakrishna: అధైర్య పడొద్దు.. రైతులకు అండగా ఉంటా!

Mla Balakrishna

Mla Balakrishna

శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గం పర్యటనలో భాగంగా నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మొదటి రోజు సమీక్షలు, సమావేశాలతో బిజీబిజీ ఉన్నారు. హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి పూర్వ వైభవం తీసుకొస్తా అని హామీ ఇచ్చారు. ప్రభుత్వాసుపత్రి అభివృద్ధిపై గత పాలకులు నిర్లక్ష్యం వహించారని మండిపడ్డారు. ఆస్పత్రిలో డాక్టర్లు, సిబ్బందిని అదనంగా ఏర్పాటు చేసి రోగులకు ఇబ్బందులేకుండా చూస్తా అని, ఆస్పత్రిలో ఉన్న పరికరాలతో పాటు మరిన్ని ఎక్విప్‌మెంట్‌ ఏర్పాటు చేస్తామని బాలయ్య బాబు చెప్పారు.

Also Read: Perni Nani: ఉరేయలేవంటూ నన్ను సీఐ రెచ్చగొట్టాడు.. నేను కూల్‌గానే మాట్లాడా!

‘హిందూపురం ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి కొత్త కొత్త పరిశ్రమలు తీసుకొస్తా. హిందూపురం ప్రాంత అభివృద్ధికి సీఎం చంద్రబాబు ప్రత్యేక కృషి చేస్తున్నారు. ఏరో స్పేస్, డిఫెన్స్, ఎలక్ట్రానిక్ సిటీ పరిశ్రమలు మన దగ్గరికి రానున్నాయి. కొత్త పరిశ్రమల్లో స్థానిక నిరుద్యోగ యువతీ యువకులకే అవకాశం కల్పిస్తా. పరిశ్రమల ఏర్పాటుకు భూములు కోల్పోయే రైతులకు గిట్టుబాటు ధర కల్పించే బాధ్యత నాది. భూములు కోల్పోయే రైతులు అధైర్య పడాల్సిన అవసరం లేదు’ అని ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చెప్పుకొచ్చారు. శుక్రవారం రాత్రి కాకినాడ రూరల్ జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ కుమారుడి వివాహ వేడుకకు బాలకృష్ణ హాజరయి.. నూతన వధూవరులను ఆశీర్వదించిన విషయం తెలిసిందే.

Exit mobile version