Site icon NTV Telugu

AP Assembly: అసెంబ్లీ వైపు చూడని ఎమ్మెల్యేలు..! భారీగా తగ్గిన హాజరు..

Ap Assembly 2025

Ap Assembly 2025

AP Assembly: ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు కొనసాగుతున్నాయి.. అయితే, అసెంబ్లీ ప్రారంభమైన తొలి రోజు సభకు హాజరైన వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సభ్యులు.. గవర్నర్‌ ప్రసంగిస్తుండగానే.. ప్రతిపక్ష హోదా ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ.. ఆందోళనకు దిగారు.. ఆ తర్వాత గవర్నర్‌ ప్రసంగం కొనసాగుతుండగానే.. అసెంబ్లీ సమావేశాలను వాకౌట్‌ చేసి వెళ్లిపోయారు.. ఇక, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన 11 మంది ఎమ్మెల్యేలను మినహాయిస్తే.. సభలో 164 మంది సభ్యులు ఉండాలి.. కానీ, అసెంబ్లీలో ఎమ్మెల్యేల హాజరు శాతం భారీగా తగ్గిపోయింది.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పదే పదే చెబుతున్నా.. అసెంబ్లీకి రావడం లేదు ఎమ్మెల్యేలు.. పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొన్నటు వరకు బిజీగా ఉన్నారని భావించినా.. ఆ తర్వాత కూడా హాజరు శాతం తగ్గింది.. ఒక్కోసారి 60 మంది సభ్యులు కూడా లేకుండా సభ నడుస్తోంది..

Read Also: Kannappa : ‘కన్నప్ప’ మేకింగ్ వీడియో షేర్ చేసిన విష్ణు

వైసీపీకి చెందిన 11 మందిని మినహాయిస్తే మొత్తంగా 164 మంది సభ్యులు ఉండగా.. ఎలాంటి పరిస్థితి అయినా కూడా 100 మంది తగ్గకుండా హాజరు కావాల్సిన పరిస్థితి.. కానీ, ఆ సంఖ్య భారీగా తగ్గిపోయింది.. ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వస్తే ప్రజా సమస్యలు మరింత ఎక్కువగా ఫోకస్ అవుతాయి అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ప్రతిపక్ష సభ్యులు సభకు వస్తే.. సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకురావొచ్చు.. అది కాకుండా.. ఆయా నియోజకవర్గాల సభ్యులు వచ్చినా.. తమ నియోజకవర్గ పరిధిలోని సమస్యలను లేవనెత్తవచ్చు.. కానీ, క్రమంగా సభ్యుల హాజరు శాతం తగ్గడం ఇప్పుడు చర్చగా మారిపోయింది..

Exit mobile version