Champions Trophy 2025: భారత్‌కు పిచ్ అడ్వాంటేజ్.. ఆస్ట్రేలియా స్టార్ పేసర్ ఏమన్నాడంటే?
- ఛాంపియన్స్ ట్రోఫీ 2025 విజేతగా భారత్
- పిచ్ అడ్వాంటేజ్‌పై స్పదించిన స్టార్క్
- భారత్ ఆడిన మ్యాచులను చూడలేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025ని భారత్ గెలిచిన విషయం తెలిసిందే. సెమీస్‌లో ఆస్ట్రేలియాను, ఫైనల్లో న్యూజిలాండ్‌ను ఓడించి.. గత ఐసీసీ టోర్నీ పరాభవాలకు బదులు తీర్చుకుంది. అయితే దుబాయ్‌లోనే అన్ని మ్యాచ్‌లు ఆడడంతోనే.. టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలిచిందని పలువురు మాజీలు, ప్రస్తుత క్రికెటర్లు అన్నారు. పిచ్ అడ్వాంటేజ్ భారత జట్టుకు కలిసొచ్చిందని అభిప్రాయపడ్డారు. అయితే ఈ వాదనలను ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ కొట్టిపడేశాడు. పిచ్ అడ్వాంటేజ్ అనేది అర్థరహితమని, భారత్ బాగా ఆడిందన్నాడు.
ఫ్యానటిక్స్ టీవీతో మిచెల్ స్టార్క్ మాట్లాడుతూ… ‘పిచ్ అడ్వాంటేజ్ అవుతుందని కచ్చితంగా చెప్పలేను. ప్రస్తుతం అన్ని దేశాల క్రికెటర్లు ప్రపంచవ్యాప్తంగా అన్ని ఫ్రాంచైజీ మ్యాచుల్లో ఆడుతున్నారు. టీమిండియా ప్లేయర్లు మాత్రం కేవలం ఐపీఎల్లో మాత్రమే ఆడుతున్నారు. ఏడాదిలో 5-6 ఫ్రాంచైజ్ లీగ్‌లలో ఆడే ప్లేయర్స్ ఉన్నారు. వారితో పోలిస్తే భారత్ ప్లేయర్లకు విదేశీ పిచ్‌లపై అవగాహన తక్కువే ఉంటుందని భావిస్తున్నా. భారత్ ఛాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకోవడంలో నాకు ఆశ్చర్యం కలగలేదు. నిజం చెప్పాలంటే భారత్ ఆడిన మ్యాచులను చూడలేదు. ఆస్ట్రేలియా ఆడిన మ్యాచులే అప్పుడప్పుడు చూశా. గతేడాది నేను వరుణ్ చక్రవర్తితో కలిసి ఆడా. అతను చాలా ప్రతిభావంతుడు. అత్యుత్తమ వైట్-బాల్ జట్టు భారత్ అంటే?.. టీమిండియా అభిమానులు అవును అని చెబుతారు, ఆస్ట్రేలియన్ అభిమానులు కాదు అని చెబుతారు’ అని అన్నాడు.
Also Read
- Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
- Saudi-Europe: యూరప్‌కు సౌదీ బిగ్ షాక్.. చమురు నిలిపిపోయే అవకాశం
- Macron: యూరప్‌లో ఇంధన ధరలు మంటలు.. త్వరలో G7 దేశాల సమావేశం
- Air India: ఖర్చులు తగ్గించేందుకు కీలక నిర్ణయం.. ఎయిరిండియా కొత్త సీఈవో సూపర్ ప్లాన్!
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..