Site icon NTV Telugu

IPL 2024: ఢిల్లీని వెంటాడుతున్న గాయాల బెడద.. మరో ప్లేయర్ ఔట్..!

Mitchell Marsh

Mitchell Marsh

ఐపీఎల్ తాజా సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ను గాయాలు వదలడం లేదు. ఇప్పటికే జట్టు వరుస ఓటములతో ఇబ్బంది పడుతుండగా.. జట్టులోని కీలక ఆటగాళ్లు గాయాలతో దూరం అవుతున్నారు. తాజాగా.. మరో స్టార్ ఆటగాడు మిచెల్ మార్ష్ దూరం కానున్నారు. గాయం కారణంగా ముంబైతో జరిగే మ్యాచ్కు ఆడటం కష్టమేనని టీమ్ డైరెక్టర్ సౌరవ్ గంగూలీ తెలిపారు. అంతేకాకుండా.. అతను కోలుకోవడానికి ఎంతో సమయం పడుతుందో చెప్పలేదు. కాగా.. ఈసీజన్ లో నాలుగు మ్యాచ్లు ఆడిన మార్ష్.. 71 పరుగులు చేశాడు. బౌలింగ్లో ఒక వికెట్ పడగొట్టాడు.

Read Also: Yuvraj Singh: అభిషేక్ శర్మపై యూవీ ఫైర్.. ఎందుకో తెలుసా..?

మరోవైపు.. మరో కీలక ఆటగాడు కుల్దీప్ యాదవ్ గాయం సమస్యతో బాధపడుతున్నాడు. గ్రోయిన్ ఇంజురీ సమస్యతో బాధపడుతున్నాడని, మరింత విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. ఈ క్రమంలోనే.. విశాఖలో జరిగిన కోల్‌కతా నైట్ రైడర్స్‌ మ్యాచ్ లో అతను ఆడలేదు. కాగా.. ఇప్పుడు ఇద్దరు కీలక ప్లేయర్లు దూరం కావడంతో జట్టుకు మరిన్నీ ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ సీజన్లో ఇప్పటివరకు 4 మ్యాచ్లు ఆడిన ఢిల్లీ క్యాపిటల్స్.. కేవలం ఒక్క మ్యాచ్లో మాత్రమే గెలిచింది. కాగా.. రేపు వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్తో ఢిల్లీ తలపడనుంది.

Read Also: Karnataka: కాంగ్రెస్ నేత ఇంట్లోనే “పాకిస్తాన్” ఉంది.. బీజేపీ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు..

Exit mobile version