Site icon NTV Telugu

Miss World 2025: తెలంగాణను ప్రశంసలతో ముంచెత్తిన మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు..!

Miss World 2025

Miss World 2025

Miss World 2025: 72వ మిస్ వరల్డ్ ఫెస్టివల్‌లో భాగంగా హైదరాబాద్‌లో నిర్వహించిన “హెడ్-టు-హెడ్ చాలెంజ్” ఫినాలే సందర్భంగా.. వివిధ ఖండాల నుంచి వచ్చిన అందాల కిరీటధారులు తెలంగాణ రాష్ట్రాన్ని, ముఖ్యంగా హైదరాబాద్‌ను అభినందనలతో ముంచెత్తారు. ఈ పోటీ సందర్భంగా జడ్జీలు అడిగిన ప్రశ్నలకు తెలంగాణ సంస్కృతి, అభివృద్ధి, మహిళల సాధికారత, భద్రతకు సంబంధించి కంటెస్టెంట్స్ చేసిన వ్యాఖ్యలు ప్రపంచ దృష్టిని ఆకర్షించాయి. తెలంగాణ రాష్ట్రం మహిళల భద్రతను హక్కుగా గుర్తించి, తగిన చర్యలు తీసుకుంటుందన్న విషయాన్ని పలువురు స్పష్టం చేశారు. భద్రత అనేది ఒక హక్కు.. దానిని అందించడంలో తెలంగాణ ముందు ఉందన్నారు.

Read Also: Honda CB1000 Hornet SP: 999cc ఇన్‌లైన్-ఫోర్ సిలిండర్ ఇంజిన్, 6-స్పీడ్ గేర్‌బాక్స్ లతో హోండా CB1000 Hornet SP లాంచ్..!

హైదరాబాద్ నగర వీధుల్లో మహిళలు రాత్రిపూట కూడా భయపడకుండా స్వేచ్ఛగా తిరగగలగడం ఆశ్చర్యాన్ని కలిగించిందని అన్నారు. హైదరాబాద్ ఒక సురక్షిత నగరానికి ప్రతీక అని అభివర్ణించారు. ఇక పోలీస్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌ను సందర్శించి అక్కడ షీ టీమ్స్, హాక్ ఐ, 24×7 పర్యవేక్షణ వంటి సాంకేతిక భద్రతా వ్యవస్థలను పరిశీలించి మహిళల రక్షణ కోసం తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు వారికి విశేషంగా ఆకర్షించాయని అన్నారు. అలాగే తెలంగాణ సాంకేతికత, వైద్య రంగాల్లో అభివృద్ధి చెందడమే కాకుండా.. మహిళల హక్కులు, విద్య, సాధికారతకు కూడా అత్యున్నత ప్రాధాన్యతనిచ్చే రాష్ట్రంగా పలువురు వివరించారు. ఇది ప్రపంచానికి శక్తివంతమైన సందేశాన్ని అందిస్తున్నదని అభిప్రాయపడ్డారు.

Read Also: OPPO A5x 5G: రూ.13,999కే 6.67 అంగుళాల డిస్‌ప్లే, మిలిటరీ గ్రేడ్ బాడీ, 6000mAh బ్యాటరీతో ఒప్పో A5x లాంచ్..!

తెలంగాణ ప్రజల ఆత్మీయత, ఆదరణ, ఆతిథ్య భావం ప్రత్యేకంగా నిలిచిందని అన్నారు. రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలు స్ఫూర్తిదాయకంగా అనిపించాయని, ‘బ్యూటీ విత్ పర్పస్’ భావన ఇక్కడ జీవనశైలిలోే కనిపించిందని కంటెస్టెంట్లు చెప్పారు. తెలంగాణ అనుబంధాల తాటిపై నిలిచిన భూమి, స్నేహబంధాలకు నిలయం, సంస్కృతికి ప్రతీకగా భావిస్తున్నామని వారు అన్నారు. 72వ మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు కళ్లలో తెలంగాణ ఒక అభివృద్ధి చెందిన, మహిళలకు భద్రత కలిగిన, ఆత్మీయత నిండిన ప్రగతిశీల రాష్ట్రంగా నిలిచింది. ఇక వారు వ్యక్తం చేసిన అభిప్రాయాలు తెలంగాణ కీర్తి, అతిద్య, పురోగతిని అంతర్జాతీయంగా తెలియజేస్తున్నడంలో సందేహం లేదు.

Exit mobile version