NTV Telugu Site icon

Supreme Court: మణిపూర్ అల్లర్లపై తప్పుడు సమాచారం ఇస్తే పరిస్థితి మరింత తీవ్రమవుతుంది..

Manipur Voliance

Manipur Voliance

మణిపూర్‌లో కొనసాగుతున్న హింసాత్మకమైన ఘటనలపై దేశ అత్యున్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. హింసను మరింత పెంచేందుకు తమను వాడుకోవద్దని సుప్రీంకోర్టు కోరింది. ప్రభుత్వం చేపట్టిన చర్యల్ని తాము పర్యవేక్షిస్తామని, మరిన్ని చర్యలకు అవసరమైతే తగిన ఆదేశాలను జారీ చేస్తామని చెప్పారు.. అంతేకానీ భద్రతా యంత్రాంగాన్ని తాము నడపలేమని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. మణిపూర్ లో అల్లర్లను కట్టడి చేయాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలను సుప్రీంకోర్టు విచారణ సందర్భంగా ఈ కామెంట్స్ చేసింది.

Read Also: Adani-Hindenburg Case: అదానీ-హిండెన్‌బర్గ్ కేసు.. సుప్రీంకోర్టులో 41 పేజీల అఫిడవిట్‌ దాఖలు

ప్రస్తుత పరిస్థితిపై మణిపూర్ ప్రభుత్వం ఓ నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పించింది. దీంతో నెక్ట్స్ జరిగే విచారణ మంగళవారం జరుగుతుందని సుప్రీం కోర్టు పేర్కొంది. ఈ అంశంపై చాలా సున్నితంగా వ్యవహరించాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకోర్టులో తమ వాదనలు వినిపిస్తూ పిటిషనర్లను కోరారు. తప్పుడు సమాచారం ఇస్తే పరిస్థితి మరింత తీవ్రమవుతుందని ఆయన హెచ్చరించారు. ఇక పిటిషనర్ల తరపున వానదలు వినిపించిన సీనియర్ అడ్వకేట్ కొలిన్ గొంజాల్వెస్, మణిపూర్‌లో తీవ్రమైన ఉద్రిక్తత కొనసాగుతుందని చెప్పారు. అల్లర్లను తగ్గించేందుకు గట్టి సూచన చేయాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ అడిగారు.

Read Also: AAP Party: మరోసారి సుప్రీంకోర్టుకు ఆప్ సర్కార్.. కేంద్రానికి నోటీసులు

మేము శాంతిభద్రతలను అదుపులోకి తీసుకునేలా మీరు జాప్యం చేయకూడదు అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ అన్నారు. దానికి అడ్వకేట్ గొంజాల్వెస్ సమాధానమిస్తూ.. మణిపూర్‌లో గిరిజనులకు వ్యతిరేకంగా అనేక కథనాలు వస్తున్నాయని ఆయన అన్నారు.. అందుకు డీవై చంద్రచూడ్ బదులిస్తూ, మణిపూర్ లో ఉన్న హింస, ఇతర సమస్యలను మరింత పెంచడం కోసం వేదికగా ఈ ప్రొసీడింగ్‌ను వాడుకోకూడదుఅని ఆయన తెలిపారు.. భద్రతా యంత్రాంగాన్ని, శాంతిభద్రతలను మేము నడపలేము.. సలహాలేమైనా ఇస్తే స్వీకరిస్తామన్నారు. ఇది మానవతావాదానికి సంబంధించిన సమస్యని, దీనిని పార్టీలకు సంబంధించిన అంశంగా చూడవద్దని సీజేఐ చంద్రచూడ్ తెలిపారు.

Read Also: Viraj Ashwin: మా సినిమాకు చాలా మంది హీరోలు ఉన్నారు!

ఇక, మణిపూర్‌ రాష్ట్రంలో మెయిటీ తెగవారు తమను షెడ్యూల్డు తెగల జాబితాలో చేర్చాలని డిమాండ్ చేస్తుండగా.. ఈ డిమాండ్‌ను వ్యతిరేకిస్తూ కుకీ సహా మరికొన్ని గిరిజన జాతులు మే 3 నుంచి పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మణిపూర్ లో హింస భగ్గుమంది. రెండు నెలలుగా రాష్ట్రంలో తీవ్ర హింసాత్మక పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ హింసలో ఇప్పటికే 150 మందికి పైగా చనిపోయారు.. కేంద్ర బలగాలను రాష్ట్రంలో దింపినప్పటికీ పరిస్థితి మాత్రం ఇప్పటికి అదుపులోకి రాలేదు.

Show comments