మణిపూర్‌లో కొనసాగుతున్న హింసాత్మకమైన ఘటనలపై దేశ అత్యున్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. హింసను మరింత పెంచేందుకు తమను వాడుకోవద్దని సుప్రీంకోర్టు కోరింది. ప్రభుత్వం చేపట్టిన చర్యల్ని తాము పర్యవేక్షిస్తామని, మరిన్ని చర్యలకు అవసరమైతే తగిన ఆదేశాలను జారీ చేస్తామని చెప్పారు.. అంతేకానీ భద్రతా యంత్రాంగాన్ని తాము నడపలేమని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. మణిపూర్ లో అల్లర్లను కట్టడి చేయాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలను సుప్రీంకోర్టు విచారణ సందర్భంగా ఈ కామెంట్స్ చేసింది.