Mirai vs Kishkindhapuri: సెప్టెంబర్ 12వ తేదీన రెండు తెలుగు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. అందులో ఒకటి మిరాయ్, కాగా మరొకటి కిష్కిందపురి. నిజానికి తేజ సజ్జా హీరోగా నటిస్తున్న మిరాయ్ మూవీ సెప్టెంబర్ 5వ తేదీన రిలీజ్ కావాల్సి ఉంది. కానీ, కొన్ని సీజీ వర్క్స్ ఆలస్యం అవుతాయని ఉద్దేశంతో దాన్ని 12వ తేదీకి రిలీజ్ చేశారు. అదే రోజున ముందే ప్రకటించిన కిష్కిందపురి కూడా రిలీజ్ అవుతుంది.
వైబ్ ఉంది బేబీ.. వైబ్ ఉందిలే.. కొత్త HMD Vibe 5G, HMD 101 4G,102 4G మొబైల్స్ లాంచ్!
అయితే, ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ కిష్కిందపురి సినిమా సెట్ కావడానికి కారణం తేజ సజ్జా. చావు కబురు చల్లగా అనే సినిమా చేసి, మరో సినిమా కోసం ప్రయత్నిస్తున్న సమయంలో ఒక కథ తేజకు చెప్పాడు కౌశిక్. అయితే, ఆ కథ నచ్చి, సాహూ గారికి బయటికి వినిపించమని తేజ పంపాడు. ఆ ప్రాజెక్టు సెట్ కాలేదు. కానీ, తన దగ్గర మరొక కథ ఉందంటూ ఆయనకు చెప్పిన కౌశిక్, బెల్లంకొండతో ఆ ప్రాజెక్ట్ సెట్ చేసుకున్నాడు. అంటే, ఒకరకంగా తేజ ఈ ప్రాజెక్ట్ సెట్ కావడానికి కారణమయ్యాడు. అదే తేజ సజ్జా ఇప్పుడు అదే సినిమాతో పోటీ పడుతూ ఉండడం గమనార్హం.