Site icon NTV Telugu

Mirai : తేజ సజ్జా ‘మిరాయ్’ టీవీలో వచ్చేది ఆ రోజే!

Mirai Movie

Mirai Movie

సూపర్ హీరో ఫిల్మ్ ‘హనుమాన్’తో సెన్సేషన్ క్రియేట్ చేసిన యంగ్ హీరో తేజ సజ్జా, రీసెంట్‌గా ‘మిరాయ్’ (Mirai) చిత్రంతో మరో భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించిన ఈ విజువల్ వండర్, ఓటీటీలో కూడా అదరగొట్టింది. ఇప్పుడు ఈ చిత్రం బుల్లితెర ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ‘మిరాయ్’ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ డేట్ తాజాగా ఖరారైంది. జనవరి 25, 2026న (ఆదివారం) సాయంత్రం 5:30 గంటలకు ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్ ఛానెల్ ‘స్టార్ మా’ (Star Maa) లో ఈ సినిమా ప్రసారం కానుంది.

Also Read : Tamannaah : ఐటెం సాంగ్స్ తో సరికొత్త హిస్టరీ క్రియేట్ చేసిన మిల్కీ బ్యూటీ..!

కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో తేజ సజ్జా సూపర్ యోధుడి పాత్రలో మెప్పించగా.. మంచు మనోజ్ నెగెటివ్ షేడ్ ఉన్న పవర్‌ఫుల్ రోల్‌లో కనిపించి ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించారు. రితికా నాయక్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి గౌర హరి అందించిన సంగీతం, అద్భుతమైన విజువల్స్ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. థియేటర్లలో మిస్ అయిన వారు, మళ్ళీ మళ్ళీ చూడాలనుకునే వారు ఈ రిపబ్లిక్ డే వీకెండ్‌లో తమ కుటుంబంతో కలిసి ఈ గ్రాండ్ మూవీని బుల్లితెరపై వీక్షించవచ్చు. మరి థియేటర్లలో రికార్డులు క్రియేట్ చేసిన ఈ సినిమా టీఆర్పీ (TRP) రేటింగ్‌లో ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి!

Exit mobile version