ఒలింపిక్ పతక విజేత మీరాబాయి చాను బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నారు. సోమవారం అహ్మదాబాద్ వేదికగా జరిగిన కామన్ వెల్త్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్స్‌లో బంగారు పతకాన్ని అందుకున్నారు. మహిళల 48 కిలోల విభాగంలో మొత్తం 193 కిలోలు (84 కిలోలు + 109 కిలోలు) ఎత్తి మొదటి స్థానంలో నిలిచారు. టోటల్, స్నాచ్, క్లీన్ అండ్ జెర్క్ రికార్డులను బద్దలు కొట్టారు. స్నాచ్‌లో 84 కిలోలు, క్లీన్ అండ్ జెర్క్‌లో 109 కిలోలు ఎత్తి మీరాబాయి చాను సత్తాచాటారు.
మీరాబాయి చాను 84 కిలోల తన ప్రారంభ స్నాచ్ ప్రయత్నంలో విఫలమయ్యారు. రెండో ప్రయత్నంలో క్లియర్ చేశారు. 89 కిలోల మూడో ప్రయత్నంలో ఫెయిల్ అయ్యారు. ఆపై క్లీన్ అండ్ జెర్క్‌లో 105 కిలోల బరువును ఎత్తారు. దాన్ని 109 కిలోలకు పెంచింది. 113 కిలోల చివరి ప్రయత్నాన్ని క్లియర్ చేయలేకపోయారు. మలేషియాకు చెందిన ఐరీన్ హెన్రీ 161 కిలోలు (73 కిలోలు + 88 కిలోలు) రజతం, వేల్స్‌కు చెందిన నికోల్ రాబర్ట్స్ 150 కిలోలు ఎత్తి (70 కిలోలు + 80 కిలోలు) కాంస్యం గెలుచుకున్నారు. అంతర్జాతీయ వెయిట్‌లిఫ్టింగ్ సమాఖ్య వెయిట్ విభాగాలను సవరించిన తర్వాత మీరాబాయి చాను కొత్త 48 కిలోల విభాగంలో పోటీ పడుతున్నారు.
Also Read: Viral Video: రెస్టారెంట్‌లో అమ్మాయి చేయిని కొరికిన రొయ్య.. ఆతరువాత ఏం జరిగిందంటే?
‘అహ్మదాబాద్‌లో బంగారు పతకం గెలుచుకోవడం నాకు ఆనందంగా ఉంది. పారిస్ ఒలింపిక్స్ తర్వాత ఒక సంవత్సరం అనంతరం సొంత గడ్డపై పోటీ పడటం మరింత ప్రత్యేకంగా చేసింది. ప్రేక్షకుల మద్దతు నాకు అపారమైన ప్రేరణనిచ్చింది. ఈ విజయం నా కృషి, నా కోచ్‌ల మార్గదర్శకత్వం, దేశ ప్రజల ప్రోత్సాహం ఫలితంగా వచ్చింది. అక్టోబర్‌లో జరిగే ప్రపంచ ఛాంపియన్‌షిప్‌కు నేను సిద్ధమవుతున్నా. ఈ సమయంలో ఈ విజయం నాకు గొప్ప ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది. అంతర్జాతీయ వేదికపై భారతదేశం గర్వపడేలా చేయడానికి నా వంతు కృషి చేస్తా’ అని ఆమె మీరాబాయి చాను తెలిపారు.
मीराबाई चानू ने 𝐂𝐨𝐦𝐦𝐨𝐧𝐰𝐞𝐚𝐥𝐭𝐡 𝐂𝐡𝐚𝐦𝐩𝐢𝐨𝐧𝐬𝐡𝐢𝐩𝐬 में स्वर्ण पदक जीता 🥇।#MirabaiChanu ने अहमदाबाद में राष्ट्रमंडल भारोत्तोलन चैंपियनशिप में कुल 193 किलोग्राम भार उठाकर स्वर्ण पदक जीता। #CommonwealthWeightliftingChampionshipspic.twitter.com/bBmIsfLvxv
— आकाशवाणी समाचार (@AIRNewsHindi) August 25, 2025