NTV Telugu Site icon

YSRCP: దొంగ ఓట్లపై చంద్రబాబు ఫిర్యాదు హాస్యాస్పదం.. పవన్‌ గురించి మాట్లాడడం సమయం వృథా..!

Ysrcp

Ysrcp

YSRCP: ఆంధ్రప్రదేశ్‌లో దొంగ ఓట్ల వ్యవహారం ఇప్పుడు కాకరేపుతోంది.. ఏకంగా ఢిల్లీ వరకు చేరింది.. కేంద్ర ఎన్నికల కమిషన్‌కు అధికార, ప్రతిపక్ష నేతలు పోటీపోటీగా కేంద్ర ఎన్నికల సంఘం దగ్గర ఫిర్యాదు చేశారు.. దొంగ ఓట్లు ఎలా చేర్చుతున్నారు.. విపక్షాల ఓట్లు ఎలా తొలగించారో ఆధారాలతో సహా ఈసీకి ఇచ్చామని చంద్రబాబు చెబితే.. అసలు చంద్రబాబు హయాంలోనే దొంగ ఓట్లు నమోదు చేశారు.. వాటితోనే ఆయన విజయం సాధించారంటూ ఈసీ దృష్టికి తీసుకెళ్లింది వైసీపీ.. ఇక, ఈ వ్యవహారంపై స్పందించిన మంత్రి ఉషాశ్రీ చరణ్‌.. తిరుమలలో మీడియాతో మాట్లాడుతూ.. దొంగ ఓట్లను నమోదు చెయ్యించింది చంద్రబాబు ప్రభుత్వ హయంలోనే అని ఆరోపించారు. దొంగ ఓట్లుపై చంద్రబాబు ఫిర్యాదు చేయడం హాస్యాస్పదంగా ఉందని దుయ్యబట్టారు..

Read Also: Mrunal Thakur:మత్తు లో పడేస్తున్న మృణాల్ ఠాకూర్

ఎన్నికల్లో ఓడిపోతామని భయంతో చంద్రబాబు ఫిర్యాదులు చేస్తున్నారని ఆరోపించారు ఉషాశ్రీ చరణ్‌.. రాబోవు ఎన్నికల్లో మళ్లీ విజయం సాధించేది వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీయే.. జగనన్న మళ్లీ సీఎం కాబోతున్నారు అనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు మంత్రి ఉషాశ్రీ చరణ్‌. మరోవైపు మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడుతూ.. చంద్రబాబు దొంగ ఓట్లతో విజయం సాధించారని ఆరోపించారు.. దొంగ ఓట్లను తొలగించాల్సిందే.. అర్హత ఉన్నవారి ఓట్లను కొనసాగించాల్సిందే అన్నారు. ఇక, పవన్‌ కల్యాణ్‌ గురించి మాట్లాడడం అంటే.. సమయం వృథా చేసుకోవడమే అని ఎద్దేవా చేశారు మంత్రి నాగార్జున. కాగా, ఏపీలో దొంగ ఓట్ల వ్యవహారం తీవ్ర ఆరోపణలకు దారి తీసింది.. మీ హయాంలోనే దొంగ ఓట్లు నమోదు చేశారంటే.. మీ హయాంలోనే మాకు అనుకూలంగా ఓట్లను తొలగిస్తున్నారంటూ పరస్పర విమర్శలకు దిగుతున్నారు అధికార, ప్రతిపక్ష నేతలు.