Ministers : మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క నేడు మేడారంలో పర్యటించనున్నారు. ఉదయం 10.45 కి గంటలకు వీరిద్దరూ హెలికాప్టర్ లో మేడారంకు చేరుకుంటారు. ముందుగా అమ్మవార్లను దర్శించుకుని, తర్వాత మేడారం మహాజాతర పనులను పరిశీలిస్తారు. జాతర జరిగే ఏరియా మొత్తం వీరిద్దరూ పర్యటించి స్వయంగా పరిశీలించబోతున్నారు. మహా జాతర పనుల పురోగతిపై సీతక్క తో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు మంత్రి పొంగులేటి. ఈ సమీక్ష మధ్యాహ్నం ఒంటిగంట వరకు జరగనుంది. మీటింగ్ తర్వాత ఇద్దరూ హైదరాబాద్ చేరుకుంటారు.
read also : Pawan Kalyan : ఆ హిట్ డైరెక్టర్ తో పవన్ సినిమా..? నిజమైతే భలే ఉంటుందే..
అయితే ఈ మీటింగ్ కు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ హాజరు కావట్లేదు. ఆమె లేకుండానే వీరిద్దరూ సమీక్ష నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. మేడారం జాతర మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ సారి జాతరకు అంగరంగ వైభవంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. మంత్రి సీతక్క దగ్గరుండి ఈ ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. మొన్ననే సీఎం రేవంత్ రెడ్డి జాతర ఏర్పాట్లను పరిశీలించి వెళ్లారు. ఆయన త్వరలోనే మళ్లీ వచ్చే అవకాశాలు ఉన్నాయి.
read also : Bigg Boss 9 : కాంట్రవర్సీ ఉన్నోళ్లే కావాలి.. బిగ్ బాస్ తిడుతున్నా పట్టించుకోవా..
