South Telangana Project: నేడు పెండింగ్ ప్రాజెక్ట్ లపై మంత్రుల సమీక్ష..
- దక్షిణ తెలంగాణా ప్రాజెక్ట్ లపై రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ డ్రైవ్..
- S.L.B.C టన్నెల్ పనులపై నేడు దేవరకోండలో ప్రత్యేక సమీక్ష..
- హాజరుకానున్న ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క- మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి-కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
South Telangana Project: దక్షిణ తెలంగాణాలో దీర్ఘ కాలికంగా పెండింగ్ లో ఉన్న ప్రాజెక్ట్ ల పూర్తికి రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. ఈ నేపద్యంలో ఇవాళ నల్లగొండ జిల్లా దేవరకొండ కొండలో దీర్ఘకాలికంగా పెండింగ్ లో ప్రాజెక్ట్ లను పూర్తి చేసేందుకు గాను ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క,రాష్ట్ర నీటిపారుదల శాఖామంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, రోడ్లు భవనాల శాఖామంత్రుల ఆధ్వర్యంలో తలపెట్టిన ఈ సమీక్ష సమావేశంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు పాల్గొననున్నారు. గడిచిన దశాబ్దా కాలంగా బి.ఆర్.యస్ ప్రభుత్వం లో వివక్షతకు గురైన ప్రాజెక్ట్ ల నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేసేందుకు కాంగ్రెస్ సర్కార్ ప్రణాళికలు రూపొందిస్తోంది.
పైగా ప్రాజెక్ట్ ప్రారంభంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం 2292 కోట్ల అంచనా వ్యయంతో పనులు మొదలు పెట్టగా బి.ఆర్.యస్ ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురై పెరిగిన ధరలకు అనుగుణంగా పెరిగిన అంచనాలు రెట్టింపు కావదాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం సీరియస్ గా పరిగణిస్తుంది. ఉద్దేశ్యపురంకంగానే గడిచిన బి.ఆర్.యస్ సర్కార్ ఈ ప్రాజెక్ట్ సై ఉదాసినత చూపిందంటూ విరుచుకపడుతున్నారు. ప్రధానంగా 2005 లో అప్పటి ముఖ్యమంత్రి దివంగత వై.యస్ రాజశేఖర్ రెడ్డి ఆమోదంతో 2292 కోట్లకు పాలనా అనుమతులు పూర్తి చేసుకుని పనులు మొదలు పెట్టినా 2014 తరువాత ఈ ప్రాజెక్ట్ పనులను దాదాపు ఆటకెక్కించారు.2005 నుండి 2014 వరకు కొనసాగిన కాంగ్రెస్ ప్రభుత్వంలో 1279.04 కోట్లు ఖర్చు పెట్టారు. అయితే కొత్తగా ఏర్పడిన తెలంగాణా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన బి.ఆర్.యస్ ప్రభుత్వం లో ఖర్చు పెట్టిన మొత్తాన్ని కలుపుకుంటే ఈ ప్రాజెక్ట్ పై 2643.50 కోట్లు ఖర్చు చేశారు.
Also Read
- Story Board: తమిళనాడులో ప్రతీకారమే రాజకీయమా..? కరుణ, జయ దగ్గర నుంచి విజయ్ దాకా అదే తీరా..?
- Krishna River Management Board: శ్రీశైలం, సాగర్ నీటిపై ఏపీ కీలక ప్రతిపాదన.. కేఆర్ఎంబీకి లేఖ
- PM Modi: ప్రధాని మోడీ మరో ఇన్స్టాగ్రామ్ వీడియో.. ఈసారి ఏమన్నారంటే..
- Off The Record: ఆసిఫాబాద్ కాంగ్రెస్‌లో అసంతృప్తి అగ్గి.. డీసీసీ అధ్యక్షురాలిపై తిరుగుబాటు?
తిరిగి అదే బీఆర్ఎస్ ప్రభుత్వం పెరిగిన ధరలకు అనుగుణంగా అంచనా వ్యయాన్ని 4658.89 కోట్లకు పెంచిన ప్రతిపాదనలు అనుమతుల కోసం ప్రభుత్వానికి 2023 డిసెంబర్ లో పంపించారు. ఆ తరువాత కాలంలో ఎన్నికలు జరగడం రాష్ట్రంలో అధికార మార్పిడి జరగడంతో మళ్ళీ ఎస్. ఎల్.బి.సి.టన్నెల్ పనుల ప్రస్తావన ప్రముఖంగా చర్చలోకి వచ్చింది. ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రాజెక్ట్ నిర్మాణాన్ని వేగవంతం చేసేందుకు అధికార యంత్రాంగాన్ని సన్నద్ధం చేసిన రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా తామే రంగంలోకి దిగి ఏమి జరిగింది… ఏమి జరగలేదు అన్నది బాహ్యా ప్రపంచానికి తెలిసి విదంగా మార్గదర్శనం చేసేందుకు నిర్వహిస్తున్న ఈ సమీక్ష పెండింగ్ ప్రాజెక్టుల అంశంలో కీలకంగా మారనుంది.
ఎస్.ఎల్.బి.సి టన్నెల్ పనులకు మాత్రమే ఈ సమీక్షను పరిమితము చెయ్యకుండా సుమారు లక్ష ఎకరాలకు సేద్యం లోకి తేవడంతో పాటు నార్కెట్ పల్లి, నల్లగొండ, చిట్యాల, మునుగోడు, రామన్నపేట, శాలిగౌరారం లతో పాటు కట్టంగూర్ మండలాల పరిధిలోని 107 గ్రామాలకు సురక్షిత మంచినీటినీ అందించేందుకు ఉద్దేశించ బడిన బ్రహ్మణవెళ్ళేంల బ్యాలెన్సింగ్ రిజర్వాయర్,ఉదయసముద్రం ఎత్తిపోతల పధకం,డిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పురోగతి తో పాటు సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న పిల్లాయిపల్లి, బునాదిగాని కాలువల పూర్తికి ఈ సమీక్ష ద్వారా రూట్ మ్యాప్ రూపొందించేందుకు నీటిపారుదల మరియు పౌర సరఫరాల శాఖామంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికార యంత్రాంగాన్ని సన్నద్ధం చేస్తున్నారు.
Weather Alert: మరో అల్పపీడనం.. ఏపీకి భారీ వర్ష సూచన..!
తాజావార్తలు
-
Story Board: తమిళనాడులో ప్రతీకారమే రాజకీయమా..? కరుణ, జయ దగ్గర నుంచి విజయ్ దాకా అదే తీరా..?
-
Krishna River Management Board: శ్రీశైలం, సాగర్ నీటిపై ఏపీ కీలక ప్రతిపాదన.. కేఆర్ఎంబీకి లేఖ
-
PM Modi: ప్రధాని మోడీ మరో ఇన్స్టాగ్రామ్ వీడియో.. ఈసారి ఏమన్నారంటే..
-
Off The Record: ఆసిఫాబాద్ కాంగ్రెస్‌లో అసంతృప్తి అగ్గి.. డీసీసీ అధ్యక్షురాలిపై తిరుగుబాటు?
-
Tour Of South Africa: సౌతాఫ్రికా షెడ్యూల్లో కీలక మార్పులు.. టీ20లు కూడా అక్కడే..
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్‌కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్‌లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!