NTV Telugu Site icon

Minister Vidadala Rajini: ఎవరు ఎవరిని తెచ్చుకున్నా గెలిచేది వైసీపీనే.. జగన్‌ ప్రజల గుండెల్లో నిలిచిపోతారు..

Vidadala Rajini

Vidadala Rajini

Minister Vidadala Rajini: ఏపీ రాజకీయాల్లో చంద్రబాబు-ప్రశాంత్‌ కిషోర్‌ భేటీ హాట్‌ టాపిక్‌గా మారింది.. అయితే, ఎంతమంది చంద్రబాబు కలిసి వచ్చినా.. వైఎస్‌ జగన్‌ను ఏమీ చేయలేరు.. వచ్చే ఎన్నికల్లో మళ్లీ గెలిచేది వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీయే అంటున్నారు ఏపీ మంత్రులు, వైసీపీ నేతలు.. ఇక, గుంటూరులో మీడియాతో మాట్లాడిన మంత్రి విడుదల రజిని.. ఎవరు ఎవరిని తెచ్చుకున్నా ఇక్కడ గెలిచేది వైసీపీనే అని ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, ఇస్తున్న భరోసాతో ప్రజల గుండెల్లో జగన్మోహన్ రెడ్డి నిలిచిపోతారన్న ఆయన.. ఎవరికి మద్దతు ఇవ్వాలో ప్రజలు డిసైడ్‌ అయిఉన్నారు.. ప్రజల ఆశీస్సులు జగన్మోహన్ రెడ్డికి, వైసీపీకే ఉన్నాయన్నారు.

Read Also: Dayanidhi Maran: హిందీపై డీఎంకే ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు.. వాళ్లు టాయిలెట్లు క్లీన్ చేస్తారు..

ఇక, పాదయాత్రలో వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ప్రజల కష్టాలు చూశారని తెలిపారు మంత్రి రజిని.. వాళ్ల బాధలు తీర్చడానికే నవరత్నాలు అని మేనిఫెస్టో రూపొందించారన్న ఆమె.. ఈ రాష్ట్రంలో బీసీలకు, ఎస్సీలకు, మైనార్టీలకు, ప్రభుత్వం ఇస్తున్న ప్రాముఖ్యత చూసి ప్రతి ఒక్కరు సీఎంను తమ కుటుంబ సభ్యుడిగా చూసుకుంటున్నారని తెలిపారు. ప్రభుత్వ విధానంపై , ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చారు.. వైసీపీకి, వైసీపీ ప్రభుత్వానికి మద్దతుగా ఉన్నారనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ఇదే సమయంలో.. టీడీపీ ప్రజల్లో విశ్వసనీయత కోల్పోయిందన్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకునే వ్యక్తి వైఎస్‌ జగన్మోహన్ రెడ్డి.. మరోసారి జగన్ ని దీవించేందుకు ప్రజల సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు మంత్రి విడుదల రజిని.