Minister Vidadala Rajini: విశాఖ రాజధానిగా సమర్ధించని వాళ్లు ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుక్కోడానికి వచ్చారు అంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై విరుచుకుపడ్డారు మంత్రి విడదల రజిని.. కేజీహెచ్ ప్రధాన ద్వారం ప్రారంభోత్సవానికి హాజరైన ఆమె.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో చంద్రబాబు వైద్య పరంగా చేసింది ఏమీ లేదని దుయ్యబట్టారు. ఈ ప్రభుత్వం పేదల కోసం ఎన్నో హాస్పిటల్స్, మెడికల్ కాలేజీలు తెస్తుంటే చూసి తట్టుకోలేక పోతున్నారని.. ప్రభుత్వం మీద కావాలనే బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఉత్తరాంధ్ర ప్రజలు వైసీపీ ప్రభుత్వం పాలన పట్ల సంతృప్తిగా ఉన్నారనే నమ్మకాన్ని వ్యక్తం చేసిన ఆమె.. ఏ ప్రభుత్వం లో ఎలాంటి అభివృద్ధి జరిగిందో గమనిస్తున్నారని తెలిపారు. ఇక, ప్రభుత్వం మీద పవన్ కల్యాణ్ చేస్తున్న ఆరోపణలు దారుణం అన్నారు మంత్రి.. కరోనా సమయంలో వాలంటీర్ వ్యవస్థ చేసిన సేవలు వెల కట్టలేనివి.. అలాంటి వాలంటీర్ వ్యవస్థను పట్టుకొని దండుపాల్యం బ్యాచ్ అంటూ విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.
Read Also: Mrunal Thakur: చిట్టి గౌనులో మృణాల్ హాట్ ట్రీట్.. చూశారా?
ఇక, రుషికొండ మీద పవన్ కల్యాణ్ చేస్తున్న ఆరోపణలు అవాస్తవం అన్నారు మంత్రి రజిని.. కోర్టు గైడ్‌లైన్స్ ప్రకారమే అక్కడ అంతా జరుగుతుందని స్పష్టం చేశారు. ఊరికే చంద్రబాబు నాయుడు ఇచ్చిన స్క్రిప్ట్ చదవడం కాదు.. వాస్తవాలను తెలుసుకుని మాట్లాడితే మంచిది అని హితవు పలికారు. మరోవైపు.. ఆంధ్ర మెడికల్ కాలేజ్ స్థాపించి వందేళ్లు అవుతుంది.. ఉత్తరాంధ్ర జిల్లాల నుండే కాకుండా రాష్ట్ర నలుమూలల నుండి వేలాదిమంది పేషెంట్లు వస్తుంటారు.. ఉత్తరాంద్ర ఆరోగ్య ప్రదాయిని కేజీహెచ్ లో ఎందరో లక్షలాదిమంది మెరుగైన వైద్య సేవలు పొందారని తెలిపారు. అదునాతన టెక్నాలజీతో వైద్య సేవలు అందిస్తుంది.. త్వరలోనే మరికొన్ని మెడికల్ కాలేజీలు ప్రారంభిస్తామని ప్రకటించారు మంత్రి విడదల రజిని.