Site icon NTV Telugu

Thummala: జిల్లాలను రద్దు చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి అనలేదు

Tummala

Tummala

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాలను రద్దు చేస్తామని అనలేదని.. శాస్త్రీయంగా జిల్లాల ఏర్పాటు జరగలేదని మాత్రమే అన్నారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు క్లారిటీ ఇచ్చారు. మహబూబాబాద్ పట్టణంలోని బాలాజీ గార్డెన్‌లో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి బలరాం నాయక్ గెలుపు కోరుతూ సీపీఎం ఆధ్వర్యంలో పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రి తుమ్మల మాట్లాడారు. పేదల పక్షాన పోరాటం చేసే పార్టీ సీపీఎం పార్టీ అని తెలిపారు. దేశాన్ని మతం, కులం, ప్రాంతం పరంగా విడగొట్టే ప్రయత్నం చేస్తున్న బీజేపీ, ఆర్‌ఎస్ఎస్‌కు వ్యతిరేకంగా పోరాడే పార్టీ సీపీఎం పార్టీ మాత్రమేనని పేర్కొన్నారు. అందరి సహకారంతో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందని చెప్పారు. రాజకీయ ఎత్తుగడలో భాగంగా కేసీఆర్.. బీజేపీకి 200 సీట్లు దాటవని అంటుూనే బీజేపీ మద్దతు ఇస్తు్న్నారని తెలిపారు. దేశ వ్యాప్తంగా జరుగుతున్న ఎన్నికలు పెట్టుబడిదారులకు, పేదలకు మధ్య జరుగుతున్న యుద్ధం అని చెప్పారు. ఇండియా కూటమిలో అనేక మంది దేశ భక్తులు ఉన్నారని వివరించారు. భారత దేశం భిన్న కులాలకు, మతాలకు నిలయం అని చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని.. రైతులకు పంట నష్ట పరిహారాన్ని అందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.

ఇది కూడా చదవండి: Congress: ఉగ్రవాది కసబ్, ఐపీఎస్ అధికారి హేమంత్ కర్కరేని చంపలేదట.. కాంగ్రెస్ నేత వ్యాఖ్యలు వివాదాస్పదం..

దేశ వ్యాప్తంగా ఏడు విడతల్లో పోలింగ్ జరుగుతోంది. తెలంగాణలో మే 13న పోలింగ్ జరగనుంది. ఇప్పటికే రెండు విడతల పోలింగ్ ముగిసింది. మూడో విడత మే 7న జరగనుంది. అనంతరం మే 13, 20, 25, జూన్ 1న జరగనుంది. ఎన్నికల ఫలితాలు మాత్రం జూన్ 4న విడుదలకానున్నాయి. ఇదిలా ఉంటే తెలంగాణలో అన్ని పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. విమర్శలు-ప్రతి విమర్శలతో మాటల తూటాలు పేల్చుకుంటున్నారు.

ఇది కూడా చదవండి: Ananya Pandey: ప్రియుడికి గుడ్ బై చెప్పేసిన స్టార్ హీరోయిన్..

Exit mobile version