Minister Tummala Nageswara rao: రైతు పొలంలో ఫ్లెక్సీ.. బ్యాంకు అధికారులపై మంత్రి తుమ్మల ఆగ్రహం

  • రైతు పొలంలో ఫ్లెక్సీలు
  • బ్యాంకు అధికారులపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆగ్రహం
  • ఇలాంటి పద్ధతులను తమ ప్రభుత్వం ఉపేక్షించదన్న మంత్రి
Tummala Nageswara Rao

Tummala Nageswara Rao

Minister Tummala Nageswara rao: బ్యాంకు అధికారులపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కామారెడ్డి జిల్లా లింగంపేట గ్రామంలో జిల్లా సహకార కేంద్ర బ్యాంకు వారు ఒక రైతుపొలంలో ప్లెక్సీలు కట్టడంపై వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆరా తీశారు. సదరు రైతుకు 2010లో దీర్ఘకాలిక రుణం మంజూరు చేశామని, గడువు 9 సంవత్సరాలు పూర్తి అయిన తర్వాత అనేక సార్లు కలిసి రుణాన్ని చెల్లించవలసిందిగా విజ్ఞప్తి చేశామని బ్యాంకు అధికారులు మంత్రికి వివరించారు. బ్యాంకుకు తనఖా పెట్టిన భూమిని కూడా ఇతరులకు విక్రయిస్తున్నాడని, ఆ సందర్భముగా అలా పెట్టవలసివచ్చిందని బ్యాంకు అధికారులు వివరించారు. ఇలా ప్లెక్సీలు పెట్టడం లాంటి పద్ధతులను తమ ప్రభుత్వం ఉపేక్షించదని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు.