Minister TG Bharath: టిడ్కో గృహాలతో చంద్రబాబు సంచలనం సృష్టించారు..

  • టిడ్కో గృహాలతో సీఎం చంద్రబాబు సెన్సేషన్ క్రియేట్ చేశారు..
  • జగన్నాథ గట్టుపై టిడ్కో గృహాల వద్ద మహిళా మార్ట్ కు శంకుస్థాపన చేసిన మంత్రి భరత్..
  • ప్రజలకు టిడ్కో గృహాలు ఒక వరం..
Tg Bharath

Tg Bharath

Minister TG Bharath: టిడ్కో గృహాలతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సెన్సేషన్ క్రియేట్ చేశారని పేర్కొన్నారు మంత్రి టీజీ భరత్‌.. కర్నూలులోని జగన్నాథ గట్టుపై టిడ్కో గృహాల వద్ద మహిళా మార్ట్ కు శంకుస్థాపన చేసిన మంత్రి భరత్.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. టిడ్కో ఇళ్లతో చంద్రబాబు సెన్సేషన్ క్రియేట్ చేశారని ప్రశంసలు కురిపించారు.. ప్రజలకు టిడ్కో గృహాలు ఒక వరంగా పేర్కొన్న ఆయన.. చంద్రబాబుకు మంచిపేరు వస్తుందనే గత ప్రభుత్వం టిడ్కో గృహాల విషయంలో శాడిజం ప్రదర్శించిందని మండిపడ్డారు.. గత ఐదేళ్లలో రంగులు కొట్టడం తప్ప ఏమి చేయలేదు అని ఆరోపించారు.. ఇక, మళ్లీ చంద్రబాబు సర్కార్‌ వచ్చేసింది.. క్రమంగా టిడ్కో లబ్ధిదారుల సమస్యలన్నీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.. టిడ్కో ఇళ్ల వద్ద అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు.. అంతేకాదు.. సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలోనే లబ్ధిదారులకు టిడ్కో గృహాలు అందజేస్తామని వెల్లడించారు మంత్రి టీజీ భరత్‌.

Read Also: Virat Kohli-BCCI: ఎలాంటి అపోహలు వద్దు.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ భరోసా!