NTV Telugu Site icon

Minister Sitakka: మాది ఎంప్లాయ్ ఫ్రెండ్లీ ప్రభుత్వం.. ప్రతి ఉద్యోగికి భరోసా కల్పిస్తాం..

Minister Seetakka

Minister Seetakka

సచివాలయంలో సొసైటీ ఫర్ రూరల్ డెవలప్మెంట్ సర్వీసెస్ (SRDS) బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల సమావేశం జరిగింది. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. పంచాయత్ రాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ సెక్రెటరీ లోకేష్ కుమార్, కమిషనర్ అనితా రామ చంద్రన్, స్పెషల్ కమిషనర్ షఫీ ఉల్లా, ఇతర ఉన్నతాధికారులు సమావేశానికి హాజరయ్యారు.

READ MORE: Emirates flights: ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ కీలక నిర్ణయం.. పేజర్ల, వాకీటాకీలపై నిషేధం

ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. బోర్డు మీటింగ్ పదేళ్లుగా నిర్వహించకపోవడం పట్ల మంత్రి సీతక్క విస్మయ వ్యక్తం చేశారు. పదేళ్లుగా మీటింగ్ నిర్వహించకపోతే ఉద్యోగుల సమస్యలు ఎలా తెలుస్తాయని ప్రశ్నించారు. ఎస్‌ఆర్‌డీఎస్ లో కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ద్ధతిలో 3700కు పైగా ఉద్యోగులు ఉన్నట్లు సీతక్క తెలిపారు. టెక్నికల్ అసిస్టెంట్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, ఆఫీసు సుబ్బార్డనేట్ల, ఇంజనీరింగ్ కన్సల్టెంట్లకు ఉద్యోగ భద్రత కల్పించేలా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు.

READ MORE:Beautiful Girls : దేశంలో అత్యంత అందమైన యువతులు ఉన్న రాష్ట్రాలు ఇవే…

ఎంప్లాయ్ ఫ్రెండ్లీ ప్రభుత్వం తమదని.. ఉద్యోగుల సంతోషంగా ఉంటేనే క్రియాశీలకంగా పని చేయగలుగుతారని మంత్రి సీతక్క అన్నారు. “అప్పుడే ప్రభుత్వ లక్ష్యాలు ఉద్దేశాలు ప్రజలకు చేరుతాయి. పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ ప్రజలు ప్రభుత్వానికి ఆయువు పట్టు లాంటిది. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధితోపాటు ప్రజల జీవన ప్రమాణాలను పెంచే శాఖ మనది. అందుకే వీలైనంత మేర ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తాం. ఉద్యోగులకు భరోసా కల్పించేలా చర్యలు చేపడతాం. ఉద్యోగి కుటుంబానికి భరోసా కల్పిస్తాం. ఉద్యోగికి దురదృష్టవశాత్తు ఏదైనా జరిగితే కుటుంబాన్ని ఆదుకుంటామని భరోసా కల్పిస్తాం . ఎస్‌ఆర్‌డీఎస్ ఉద్యోగికి రిటైర్మెంట్ తర్వాత ప్రభుత్వ ఉద్యోగి వలె ప్రయోజనాలు కల్పించేందుకు ప్రయత్నిస్తాం. ఏండ్లుగా పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరిస్తాం. ఉద్యోగులకు రావాల్సిన అన్ని ప్రయోజనాలను అందజేస్తాం. దానికి సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేసి ఆర్థిక శాఖ ఆమోదం తీసుకుంటాం. అంతా చిరు ఉద్యోగులే.. వారిని కాపాడాల్సిన బాధ్యత మా ప్రభుత్వంపై ఉంది.” అని పేర్కొన్నారు.

Show comments