Minister Seethakka: చచ్చిన శవాలకు బీజేపీ టాక్స్ వసూల్ చేసారని మంత్రి సీతక్క అన్నారు. భవిష్యత్ బాగుండాలంటే కాంగ్రెస్ ను ఆదరించాలని సూచించారు. పెండింగ్ పనులను అన్నీ పూర్తి చేస్తామన్నారు. జిల్లాను అభివృద్దిలో అగ్రబాగంలో ఉంచుతామన్నారు. దేహాలు ముక్కలు అయినా పర్వాలేదు అని దేశం కోసం పని చేసింది ఇందిరా గాంధీ కుటుంబం అని తెలిపారు. బీజేపి మతాల గురించి తప్ప పనుల గురించి చెప్పరని అన్నారు. మోడీ వచ్చి ఆదిలాబాద్ కు ఏం ఇచ్చారని అని ప్రశ్నించారు. మూత పడ్డ సిసిఐ పరిశ్రమ గురించే మాట్లాడలేదని అన్నారు.
Read also: Top Headlines @ 1 PM: టాప్ న్యూస్
గ్యారంటిలకే గ్యారంటీ కాంగ్రెస్ పార్టీ అని తెలిపారు. పదేళ్లు ఏం చేయకుండా.. బీజేపీకి ఓటు వేస్తే రాష్ట్రాన్ని, మన భవిష్యత్ ను .. విద్య మీద, బట్టల మీద 12 శాతం టాక్సీ వేసిందన్నారు. పేదలను మరింత పేదలను చేసిందని మండిపడ్డారు. ప్రజలను తల్చుకుంటే ఎవ్వరిని ఎక్కడ కూర్చో బెట్టాలో అక్కడ కూర్చోబెడతారని క్లారిటీ ఇచ్చారు. బీజేపీకి జంతువుల మీద ఉన్న ప్రేమ ప్రజల మీద లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. చచ్చిన శవాలకు బీజేపి టాక్స్ వసూల్ చేసారని కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ను ఓట్ల తో పక్కన పెట్టిన వారు ఇప్పుడు బీజేపీని పక్కన పెట్టాలని సూచించారు.
Read also: Sobhita Dhulipala: ట్రెండీ డ్రెస్సులో అందాలు ఆరబోస్తున్న శోభితా…
అంతేకాకుండా.. నిన్న పెద్దపల్లిలో పర్యటించిన సీతక్క వచ్చే ఎన్నికల్లో గల్లీ ఎన్నికలు కాదు.. ఢిల్లీ ఎన్నికలు అని మంత్రి సీతక్క అన్నారు. కార్యకర్తలు ఇగోలు పక్కనపెట్టి కలిసికట్టుగా పని చేయాలని, పెద్దపల్లి ఎంపీ సీటును రాహుల్ గాంధీకి కానుకగా ఇవ్వాలని మంత్రి సూచించారు. ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఆమె హాజరయ్యారు. గత ప్రభుత్వం వల్ల నిరుద్యోగం పెద్ద ఎత్తున పెరిగిపోయిందని మంత్రి సీతక్క ఆవేదన వ్యక్తం చేశారు. బీటెక్, డిగ్రీలు చదివి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉపాధి హామీ పనులకు సైతం వెళ్తున్నారని తెలిపారు.
Insomnia: నిద్రలేమితో బాధపడుతున్నారా?.. అయితే ఈ విషయం తెలుసుకోవాల్సిందే!