NTV Telugu Site icon

Seethakka: బీఆర్ఎస్.. బీజేపీకి బీ టీంగా ప‌నిచేస్తోంది

హైదరాబాద్‌లోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ స‌చివాల‌యంలో మంత్రి సీత‌క్క మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ త‌ప్పుడు ప్రచారంపై మంత్రి సీత‌క్క ఆగ్రహం వ్యక్తం చేశారు. మహారాష్ట్రలో బీజేపీకి లబ్ది చేకూర్చేందుకు బీఆర్ఎస్ కుట్ర పూరితంగా వ్యవ‌హ‌రిస్తోందని దుయ్యబట్టారు. బీజేపీకి బీ టీంగా బీఆర్ఎస్ ప‌నిచేస్తోందని మంత్రి ఆరోపించారు. కేసులు నుంచి తప్పించుకునేందుకు బీజేపీతో బీఆర్ఎస్ అంట‌కాగుతోందని పేర్కొన్నారు. మహారాష్ట్ర ఎన్నికల షెడ్యూల్ వ‌చ్చిన నాటి నుంచి ప‌క్కా ప్రణాళిక‌తో బీఆర్ఎస్ విష ప్రచారం చేస్తుందని మంత్రి సీతక్క తెలిపారు.

Read Also: Gowtham Gambhir: న్యూజిలాండ్‌తో ఓటమిపై తొలిసారిగా మౌనం వీడిన గంభీర్.. ఏం చెప్పాడంటే?

పదే ప‌దే త‌ప్పుడు ప్రచారం చేస్తూ ప్రజా ప్రభుత్వంపై విషం చిమ్ముతోందని మంత్రి సీతక్క అన్నారు. అందులో భాగంగా మ‌హిళ‌ల ఉచిత ప్రయాణ ప‌థ‌కంపై దుష్ప్రచారం చేస్తున్నారు.. అత్యవ‌స‌ర స‌మయాల్లో చేతిలో చిల్లి గ‌వ్వ లేకున్నా మ‌హిళ‌లు ఉచిత ప్రయాణాలు చేస్తున్నారన్నారు. ఆటో డ్రైవర్లను ఉసి గొల్పి ధర్నాలు చేయిస్తున్నారు.. ఓలా, ఉబ‌ర్ క్యాబ్‌లు, బైకులు తెచ్చిన‌ప్పుడు ఆటో డ్రైవ‌ర్లు గుర్తుకు రాలేదా..? అని మంత్రి ప్రశ్నించారు.

Read Also: Hyderabad: ఆరాంఘర్‌లో అగ్నిప్రమాదం.. స్క్రాప్ గోదాంలో భారీగా మంటలు

కోట్లాది మంది మహిళలకు అన్యాయం చేసేలా బీఆర్ఎస్ కుట్రలు ప‌న్నుతోందని మంత్రి సీతక్క పేర్కొన్నారు. పంట రుణ‌మాఫీ చేయ‌ని బీఆర్ఎస్.. ఇప్పుడు రైతులపై ప్రేమ కురిపించ‌డం విడ్డూరంగా ఉందని అన్నారు. బీఆర్ఎస్ హయంలో 20 లక్షల మంది రైతుల‌కు రుణమాఫీ చేయ‌లేదు.. బీఆర్ఎస్ చేసిన రుణ మాఫీ వ‌డ్డీల‌కు కూడా స‌రిపోలేదని మంత్రి సీతక్క తెలిపారు.