NTV Telugu Site icon

Minister Sidiri Appalaraju : పవన్ మాటల వెనుక అంతర్యం ఏమిటి..?

Appal Raju

Appal Raju

తెలంగాణ మంత్రులు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని అవమానపరుస్తుంటే జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఎందుకు నోరు మెదపటం లేదని మంత్రి సీదిరి అప్పలరాజు ప్రశ్నించారు. తెలంగాణ మంత్రి హరీశ్ రావును పవన్ వెనుకేసుకొచ్చి మాట్లాడుతున్నారంటే ఎలా అర్థం చేసుకోవాలని మంత్రి అప్పల రాజు నిలదీశారు. బీఆర్ఎస్ మంత్రులు ఏపీ రాష్ట్రాన్ని అవమానపరుస్తుంటే పవన్ కల్యాణ్ ఎందుకు మౌనంగా ఉన్నాడని మండిపడ్డాడు. బీఆర్ఎస్ తో పవన్ కల్యాణ్ కు రహస్య ఒప్పందం ఏమిటీ.. పవన్ కల్యాణ్ తో బీఆర్ఎస్ వేల కోట్ల ఒప్పందం జరిగిందని మీడియాలో చూశా.. ఇది బహుశా.. నిజమేనేమో అని సీదిరి అప్పలరాజు విమర్శించారు. పవన్ కల్యాణ్ తెలంగాణలో బీఆర్ఎస్ తో ఏపీలో చంద్రబాబుతో పవన్ కల్యాణ్ కు ఉన్న లాలూచీ ఏమిటంటూ ప్రశ్నించారు.

Read Also : Gopal Italia: గుజరాత్ లో ఆప్ నేత అరెస్ట్.. భయం లేదన్న ఇటాలియా

వరంగల్ లో అమ్మాయి ఆత్మహత్య.. తెలంగాణ ఆస్పత్రిలో వీల్ చైర్ లో రోగిని ఈడ్చుకు వెళ్తే మాట్లాడావా.. గోదావరి జలాలపై మాట్లాడావా.. మరి ఇప్పుడు హరీశ్ రావుని వెనకేసుకొచ్చి మాట్లాడుతున్నవంటే.. మేం ఏం అర్థం చేసుకోవాలని మంత్రి సీదిరి అప్పలరాజు జనసేనానిపై విమర్శలు గుప్పించారు. పవన్ కల్యాణ్ సీఎం జగన్ ను తక్కువ చేసి మాట్లాడితే ఊరుకునేది లేదు అని మంత్రి అప్పల రాజు హెచ్చరించారు. ఇప్పటికే జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై వైసీపీ మంత్రులు విమర్శల పర్వం గుప్పిస్తున్నారు. వైసీపీ మంత్రులు మంత్రి హరీశ్ రావును విమర్శించడంపై స్పందించిన పవన్ కల్యాణ్ తెలంగాణ ప్రజలను విమర్శించడం పద్దతి కాదు వెంటనే మంత్రులు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని కామెంట్స్ చేశారు. ఈ వాఖ్యలపై వైసీపీ శ్రేణులు జనసేనానిపై వరుసగా కౌంటర్ ఎటాక్ చేస్తున్నారు. వారి విమర్శలపై పవన్ కల్యాణ్ ఇప్పటి వరకు రియాక్ట్ కాలేదు.

Read Also : Cm Jagan : ఇఫ్తార్ విందులో పాల్గొన్న సీఎం జగన్

Show comments