Site icon NTV Telugu

Minister Seethakka : విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉండాలనే లక్ష్యంతో రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారు

Minister Seethakka

Minister Seethakka

Minister Seethakka : విద్యార్థుల బాధలు తెలిసిన రేవంత్ రెడ్డి సీఎంగా వున్నారని, విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉండాలనే లక్ష్యంతో రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని మంత్రి సీతక్క అన్నారు. ఇవాళ సచివాలయంలో పంచాయతీరాజ్ గిరిజన అభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క మీడియాతో మాట్లాడుతూ.. అందుకే ఎన్నడు లేని విధంగా హాస్టల్, గురుకుల విద్యార్థులకు డైట్ కాస్మోటిక్ 40% పెంచడం జరిగిందని, చరిత్రలో ఎన్నడూ లేని విధంగా విద్యార్థులకు 40 శాతం చార్జీలను పెంచిన సీఎంకి ధన్యవాదాలు తెలిపారు. డైట్ చార్జీలు ఏడేండ్లుగా, కాస్మెటిక్ చార్జీలు గత 16 సంవత్సరాలుగా పెరగలేదని ఆమె అన్నారు. ఏడు సంవత్సరాల క్రితం డైట్ చార్జీలు కొంచెం పెంచి.. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రచారం చేసుకుందని, ఏడేళ్లుగా ధరలు విపరీతంగా పెరిగిన అనుగుణంగా డైట్, కాస్మెటిక్ ఛార్జీలు పెంచలేదని ఆమె మండిపడ్డారు. దీంతో పిల్లలు అర్ధాకలితో ఇబ్బందులు పడ్డారని, విద్యా శాఖకు బీఆర్‌ఎస్‌ చేసింది శూన్యమని ఆమె మండిపడ్డారు. బీర్‌ఎస్‌ హయాంలో విద్య వ్యవస్థ నాశనమైందని ఆమె అన్నారు.

Stuffed Toys: పిల్లలకు ఆడుకోవడానికి మంచివే కానీ.. ప్రాణాంతకం కూడా..

పదేళ్ళు అధికారంలో ఉండి టాయిలెట్స్ కట్టలేదు.. తాగు నీరు, మౌలిక వసతులు కల్పించలేదని మంత్రి సీతక్క విమర్శించారు. ఈ సమస్యలను గుర్తించిన సీఎం రేవంత్ రెడ్డి పాఠశాలల్లో మౌలిక సదుపాయల కల్పన కోసం ప్రత్యేక దృష్టి పెట్టారని, డైట్, కాస్మెటిక్ చార్జీలు పెంచడంతో 7.65 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి జరగనుందన్నారు. పిల్లలకు కడుపునిండా భోజనం పెట్టాలని పెరిగిన ధరలకు అనుగుణంగా డైట్, కాస్మెటిక్ చార్జీలను పెంచిన సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. ఇక హాస్టల్ విద్యార్థులు అర్థాకలితో అవస్థలు పడాల్సిన అవసరం లేదని, పెంచిన చార్జీలతో విద్యార్థులకు పోషకాహారం అందించాల్సిన బాధ్యత టీచర్లది హాస్టల్ సిబ్బందిది అని ఆమె అన్నారు. హాస్టల్ విద్యార్థులకు డైట్, కాస్మెటిక్ చార్జీలు గ్రీన్ ఛానల్ ద్వారా చెల్లిస్తామని ఆమె తెలిపారు. పెంచిన చార్జీలు అందుకుబోతున్న విద్యార్థులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఇదే విద్యార్థులకు అసలైన దీపావళి అని మంత్రి సీతక్క వ్యాఖ్యానించారు.

ChatGPT Search Engine: గూగుల్‌కు చెక్ పెట్టేందుకు చాట్‌జీపీటీ సెర్చ్‌ఇంజిన్‌ రెడీ..

Exit mobile version