మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలపై మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం సర్పంచుల పెండింగ్ బిల్లులు చెల్లించాలని.. లేదంటే వారి తరుఫున గొంతు విప్పుతామని కేటీఆర్ అన్నారు. ఈ క్రమంలో తాజాగా మంత్రి సీతక్క స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మీడియాతో మాట్లాడుతూ.. వెయ్యి పశువులను తిన్న రాబంధు నీతి కథలు చెప్పినట్టు కేటీఆర్ వ్యవహారం ఉందంటూ కౌంటర్ వేశారు. సర్పంచ్‌లకు నిధులు ఇవ్వకుండా బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఘోష పెట్టిందన్నారు. కేటీఆర్ ఇప్పుడు సర్పంచ్‌ల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు.
Read Also: Governor Tamilisai: గవర్నర్ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్.. దర్యాప్తు వేగవంతం
గత ప్రభుత్వం సర్పంచ్‌లను వేధించిందన్నారు. నిధులు మంజూరు చేయకపోవడంతో సర్పంచ్‌లు ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు. త్వరలోనే సర్పంచ్‌లకు రావాల్సిన నిధులన్నీ విడుదల చేస్తామని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. ఇంట్లో ఆడవాళ్ల పుస్తెల తాళ్లు అమ్మి మరీ అభివృద్ధి పనులు చేస్తే.. బీఆర్ఎస్ సర్కార్ ఫండ్స్ రిలీజ్ చేయకపోవడంతో చేసేదేమి లేక ఎంతో మంది సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్నారని మంత్రి సీతక్క అన్నారు. రాష్ట్రంలోని సర్పంచుల ఆత్మహత్యలకు బీఆర్ఎస్ పార్టీనే కారణమని తెలిపారు.
Read Also: Ram Mandir: రామ మందిర నిర్మాణ ఖర్చు, దర్శనం-హారతి సమయం.. పూర్తి వివరాలు మీ కోసం..